Leo Movie | ‘లియో’ మూవీ మైండ్ బ్లోయింగ్ అన్న గౌతమ్ వాసుదేవ్ మీనన్.. వీడియో వైరల్
Gautham Vasudev Menon | కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘లియో’ (Leo.. Bloody Sweet). లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ‘మాస్టర్’ తర్వాత విజయ్-లోకేశ్ కాంబోలో వస్తోన్న రెండో చిత్రమిది. యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ సినిమా.. లాంఛ్ చేసిన రోజు నుంచే హైప్ క్రియేట్ చేస్తూ వస్తుంది.
Gautham Vasudev Menon | కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘లియో’ (Leo.. Bloody Sweet). లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ‘మాస్టర్’ తర్వాత విజయ్-లోకేశ్ కాంబోలో వస్తోన్న రెండో చిత్రమిది. యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ సినిమా.. లాంఛ్ చేసిన రోజు నుంచే హైప్ క్రియేట్ చేస్తూ వస్తుంది. అక్టోబర్ 19న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్, టైటిల్ ప్రోమో గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ లాంచ్ చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ మూవీకి సంబంధించి ఒక లేటెస్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ మూవీపై ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా గురించి ఒక ఈవెంట్లో మాట్లాడుతూ.. ‘లియో’ మైండ్ బ్లోయింగ్ మూవీ. నా డబ్బింగ్ సమయంలో ‘లియో’లోని కొన్ని సీన్స్ చూశా. సినిమా సూపర్‌గా వచ్చింది. విజయ్‌తో వర్క్ చేయడం అద్భుతమైన అనుభూతి అంటూ గౌతమ్ మీనన్ తెలిపాడు. దీంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈ వీడియోను చూసిన దళపతి ఫ్యాన్స్ ‘లియో’ బ్లాక్ బస్టర్ హిట్టు అంటూ తెగ వైరల్ చేస్తున్నారు.
#Leo is a MIND BLOWING FILM – says Gautham Vasudev Menon…pic.twitter.com/PTR7GhIqE5
— AB George (@AbGeorge_) September 30, 2023
5 Days to go ⌛️! The Great Indian Suicide streaming on aha from October 6! #GreatIndianSuicideOnAHA pic.twitter.com/473y0lL2HP
— ahavideoin (@ahavideoIN) October 1, 2023
ఇక విజయ్‌తో పాటు ఈ సినిమాలో కోలావుడ్ నటి త్రిష, బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ ప్రియా ఆనంద్, మలయాళ నటి శాంతి మాయాదేవి, మన్సూర్ అలీఖాన్, గౌతమ్ వాసు దేవ్‌మీనన్, మిస్కిన్, మాథ్యూ థామస్, సాండీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

