Leo Movie | కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘లియో’ (Leo.. Bloody Sweet). లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ‘మాస్టర్’ తర్వాత విజయ్-లోకేశ్ కాంబోలో వస్తోన్న రెండో చిత్రమిది. యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ సినిమా.. లాంఛ్ చేసిన రోజు నుంచే హైప్ క్రియేట్ చేస్తూ వస్తుంది. అక్టోబర్ 19న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్, టైటిల్ ప్రోమో గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ లాంచ్ చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ మూవీకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది.
తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. సెన్సార్ లియో సినిమాకు యూ/ఏ(U/A) సర్టిఫికేట్‌ను జారీ చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియాలో తెలిపారు. రెండు గంటల నలభై నిమిషాల రన్టైమ్తో ఈ సినిమా ప్రదర్శితం కానుంది. ఇక రన్ టైమ్ ఈ సినిమాకు కలిసొచ్చేలానే ఉంది. ఇక సెన్సార్ సభ్యులు తెలిపిన ప్రకారం.. లియో మూవీలో విజయ్ యాక్టింగ్ వేరే లెవెల్ అని, ఆయన కెరీర్ లోనే బెస్ట్ సినిమాల్లో లియో ఉంటుందని సమాచారం. దీంతో ఈ సినిమాపై అభిమానులు మరింత అంచనాలను పెంచేసుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈరోజు లియో ట్రైలర్ విడుదల కానుంది.
#LEO CENSORED U/A 🔥 pic.twitter.com/FtNdFd0AYV
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) October 4, 2023
ఇక లియోలో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ ప్రియా ఆనంద్, మలయాళ నటి శాంతి మాయాదేవి, మన్సూర్ అలీఖాన్, గౌతమ్ వాసు దేవ్‌మీనన్, మిస్కిన్, మాథ్యూ థామస్, సాండీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంజయ్ దత్ ఆంటోనీ దాస్ గ్లింప్స్ కూడా ఇప్పటికే నెట్టింటిని షేక్ చేస్తోంది.