Singeetham Srinivasa Rao | భారతీయ సినీ చరిత్రలో అద్భుత ప్రయోగాలు చేసిన దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, 94 ఏళ్ల వయసులో మళ్ళీ మెగాఫోన్ పట్టి సరికొత్త మ్యాజిక్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన దర్శకత్వం వహించడమే కాకుండా కీలక పాత్రలో నటించిన చిత్రం ‘సింగ్ గీతం’. ఈ సినిమా టీజర్‌ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘కల్కి 2898 AD’ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తుండటం విశేషం. టీజర్ చూస్తుంటే ఒక వైవిధ్యమైన కథాంశంతో, సంగీత ప్రాధాన్యత ఉన్న చిత్రంగా ఇది కనిపిస్తోంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ (DSP) ఈ చిత్రానికి అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించారు. జూన్ 11వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ వయసులో కూడా ఆయనలోని ఉత్సాహం చూసి సినీ ప్రముఖులు మరియు అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.