Singer Sunitha | ప్రముఖ సీనియర్ దర్శకుడు కే.రాఘవేంద్రరావు నిర్మాతగా మారి ఆర్.కె.టెలీ షో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ‘శాంతి నివాసం’ సీరియల్‌తో దర్శకుడు రాజమౌళిని పరిచయం చేశారు. ఇప్పుడే ఇదే బ్యానర్ 25 వసంతంలోకి అడుగు పెట్టిన సందర్భంగా రాఘవేంద్రరావు మరో చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం ద్వారా ప్రముఖ గాయనీ సునీత కుమారుడు ఆకాష్‌ని హీరోగా పరిచయం చేస్తున్నారు. ‘సర్కారు నౌకరి’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రానికి గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు తుదిదశలో వున్న ఈ చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. ఈ చిత్రానికి సంగీతం: శాండిల్య.