Legally Veer | ఓటీటీలోకి వచ్చేసిన లీగల్లీ వీర్ మూవీ
Legally Veer | వీర్ రెడ్డి, దయానంద్ రెడ్డి, తనూజా పుట్టాస్వామి, ప్రియాంకా రౌరి, లీల సామ్సన్..ఢిల్లీ గణేశన్( స్వర్గీయ), గిరిధర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘లీగల్లీ వీర్’. ఈ సినిమాను రవి గోగుల డైరెక్ట్ చేశారు.
Legally Veer | వీర్ రెడ్డి, దయానంద్ రెడ్డి, తనూజా పుట్టాస్వామి, ప్రియాంకా రౌరి, లీల సామ్సన్..ఢిల్లీ గణేశన్( స్వర్గీయ), గిరిధర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘లీగల్లీ వీర్’. ఈ సినిమాను రవి గోగుల డైరెక్ట్ చేశారు. సిల్వర్ కాస్ట్ బ్యానర్ పై శాంతమ్మ మలికిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించగా గతేడాది డిసెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా హీరో వీర్ రెడ్డి వృత్తి రీత్యా లాయర్, అలాగే ఒక లీగల్ థ్రిల్లర్ సినిమా చేయాలని ఉద్దేశంతో ఈ సినిమా ఆయన స్వయంగా హీరోగా నటించడం గమనార్హం.
గతేడాది థియేటర్లోకి విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చింది. ఓటీటీ ప్లాట్ ఫామ్ లయన్స్‌గేట్ ప్లేలో లీగల్లీ వీర్ స్ట్రీమింగ్ అవుతుండగా.. ఆ ప్లాట్ఫామ్లో టాప్ 5 ట్రెండింగ్ ఒకటిగా నిలిచింది. తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా ప్రసారమవుతోంది. ఇక ఈ సినిమా డిసెంబర్ 10 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో కూడా స్ట్రీమింగ్ కానుంది.
మలికిరెడ్డి వీర్ రెడ్డి తన తండ్రికి నివాళిగా తెరకెక్కిన ఈ చిత్రంలో రియల్ కోర్టు డ్రామా ఎలా ఉంటుందో చక్కగా చూపించారు. మిగతా కోర్టు రూమ్ డ్రామా సినిమాలలో ఉన్నట్లు ఈ సినిమాలో మెలో డ్రామా ఉండదు. నిజంగా కోర్టులో ఎలాంటి ప్రొసీజర్స్ ఫాలో అవుతారు. ఎలాంటి ప్రోటోకాల్ ఫాలో అవుతారు. అనే విషయాలను కూడా సినిమాలో డిస్కస్ చేశారు. ఒక మర్డర్ మిస్టరీ తో పాటు తండ్రి కొడుకుల సెంటిమెంట్ అలాగే ఇండియా వచ్చిన ఒక ఎన్నారై కి ఎదురైన కష్టాలు వంటివి బాగా చూపించారు.
“వీర్ పాత్ర పోషించడం కష్టమైన సరే నిజాయతీగా చేశాను. ఇంతవరకు మన దగ్గర లీగల్ థ్రిల్లర్ సినిమాలు అంతగా రాలేదు. రియల్ కోర్టు డ్రామా ఎలా ఉంటుందో చూపించాలని అనుకున్నాను. నటనకు కొత్త కావడంతో నాకు చాలా కష్టంగా అనిపించింది. చాలా టేక్స్ తీసుకున్న. డబ్బింగ్లో ప్రాబ్లం వచ్చింది కానీ సినిమా చాలా అద్భుతంగా చేశాను. ఈ కథ నాకు చాలా వ్యక్తిగతమైనది. నా ప్రయాణంలోని ప్రతి క్షణాన్ని విలువలతో రూపొందించిన ఈ సినిమా నా తండ్రికి నివాళి. అని వీర్ రెడ్డి తెలిపారు. లీగల్లీ వీర్ OTTలో రిలిజ్ కాగా రెండు వారాల నుంచి మంచి వ్యూస్ రాబడుతూ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | ఫ్రాన్స్ నిరసనకారుల్లో తీవ్రవాద భావజాల అమెరికన్లు..!
Diaper Rash | డైపర్ వాడుతున్న తల్లిదండ్రులకు అలర్ట్.. చిన్నారుల చర్మాన్ని కాపాడేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
గోల్డెన్ డ్రెస్‌లో నభా నటేష్.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తోందిగా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

