నటనపై ఇష్టం బాధల్ని మరిపించింది
“తమ్ముడు’లో నా పాత్ర పేరు ఝాన్సీ కిరణ్మయి. నితిన్ అక్కగా కనిపిస్తా. దర్శకుడు శ్రీరామ్‌వేణు ఈ కథ చెప్పినప్పుడు, కరెక్ట్ కమ్‌బ్యాక్ మూవీ అనిపించింది’ అని సీనియర్ నటి లయ అన్నారు. నితిన్ హీరోగా శ్రీరామ్‌వేణు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తమ్ముడు’.
“తమ్ముడు’లో నా పాత్ర పేరు ఝాన్సీ కిరణ్మయి. నితిన్ అక్కగా కనిపిస్తా. దర్శకుడు శ్రీరామ్‌వేణు ఈ కథ చెప్పినప్పుడు, కరెక్ట్ కమ్‌బ్యాక్ మూవీ అనిపించింది’ అని సీనియర్ నటి లయ అన్నారు. నితిన్ హీరోగా శ్రీరామ్‌వేణు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తమ్ముడు’. దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రంలో లయ కీలక పాత్ర పోషించారు. జూలై 4న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు లయ.
‘ఈ సినిమాకోసం యూఎస్‌లో నా జాబ్ వదిలేశాను. అవకాశాలు కోరుకున్నప్పుడు రావు. అందుకే ఇండస్ట్రీ మళ్లీ నన్ను పిలిచినప్పుడు కాదనలేకపోయా. ఎంతో కష్టపడి ఈ పాత్ర చేశాను. మారేడుమిల్లి అడవుల్లో రాత్రివేళ చేసిన షూటింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని జీవితంలో మరిచిపోలేను. కొన్ని సీన్స్‌లో చెప్పుల్లేకుండా నటించాను. చాలా దెబ్బలు తగిలాయి. యాక్టింగ్‌పై ఉన్న ఇష్టం ఆ బాధలన్నింటినీ మరిపించింది’ అని లయ పేర్కొన్నారు. వివాహానంతరం భర్తతో కలిసి యూఎస్‌లో స్థిరపడిందామె.
సినీపరిశ్రమలో ఏదో ఒకటి సాధించాలనే తపనతోనే మళ్లీ తిరిగొచ్చానని, మంచి పాత్ర అనిపిస్తే మదర్‌గా చేయడానికైనా రెడీ అని, తాను యూఎస్ ఆర్టిస్ట్‌ని కానని, హైదరాబాద్ లోకల్ ఆర్టిస్టునేనని, ఇక్కడ కూడా తనకు ఇల్లు ఉందని, తనకోసం నిర్మాతలు ప్రత్యేకంగా సదుపాయాలను కూడా చూడాల్సిన పనిలేదని లయ పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- dilraju
- laya
- Nithin
- Thammudu movie
RELATED ARTICLES
తాజా వార్తలు
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

