Sathi Leelavathi OTT | విడుదలైన 12 రోజులకే ఓటీటీలోకి.. డిజిటల్ ప్లాట్ఫామ్లో సందడి చేస్తున్న లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’!
Sathi Leelavathi OTT | మెగా కోడలు లావణ్య త్రిపాఠి కొణిదెల వివాహం తర్వాత వెండితెరపై నటించిన సరికొత్త రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం సతీ లీలావతి (Sathi Leelavathi).
Sathi Leelavathi OTT | మెగా కోడలు లావణ్య త్రిపాఠి కొణిదెల వివాహం తర్వాత వెండితెరపై నటించిన సరికొత్త రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం సతీ లీలావతి (Sathi Leelavathi). మలయాళ నటుడు దేవ్ మోహన్ హీరోగా, ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘SMS’ వంటి చిత్రాల ఫేమ్ డైరెక్టర్ తాతినేని సత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో, థియేట్రికల్ రన్ చాలా త్వరగానే ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఎవరూ ఊహించని విధంగా కేవలం 12 రోజుల వ్యవధిలోనే ఈ సినిమాను ఓటీటీ వేదికగా డిజిటల్ స్ట్రీమింగ్‌లోకి తీసుకువచ్చింది. మెగా ఫ్యామిలీకి చెందిన ఒక నటి నటించిన సినిమా ఇంత తక్కువ సమయంలో ఓటీటీ బాట పట్టడం టాలీవుడ్లో ఇదే మొదటిసారి కావడం విశేషం. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు ‘సన్ నెక్స్ట్’ (Sun NXT)తో పాటు జియో హాట్స్టార్లు ఈ చిత్ర డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా, నేటి (మే 20) నుంచే తెలుగుతో పాటు తమిళ భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే కథలో లీలావతి (లావణ్య త్రిపాఠి) ఒక స్టార్ డైరెక్టర్. చిన్నతనం నుంచి తల్లిదండ్రుల గొడవల వల్ల కొన్ని మానసిక భయాలతో పెరుగుతున్న ఆమెకు సైకాలజిస్ట్ రామ్ సేతు (దేవ్ మోహన్) అండగా నిలబడి ఆ భయాల నుండి బయటపడేస్తాడు. ఈ క్రమంలోనే ఇద్దరూ ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటారు. అయితే పెళ్లైన మూడేళ్ల తర్వాత, తాను వేరే అమ్మాయి (మడోన్నా సెబాస్టియన్)తో ప్రేమలో ఉన్నానని, తనకు విడాకులు కావాలని రామ్ సేతు భార్యను కోరతాడు. దీంతో షాక్‌కు గురైన లీలావతి భర్తను ఇంట్లోనే బంధిస్తుంది. ఆ తర్వాత వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి, అసలు సేతు బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, చివరికి ఈ జంట ఎలా ఒకటయ్యారు అనేదే ఈ సినిమా ముఖ్య కథాంశం. వివాహ బంధంలో ఉండే లోపాలను, సమస్యలను కామెడీ టచ్‌తో చూపించిన ఈ చిత్రం థియేటర్లలో మిస్ అయిన హోమ్ ఆడియన్స్‌కు ఓటీటీలో మంచి వినోదాన్ని అందిస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు.
ఈ చిత్రంలో నరేశ్ వికె, మడోన్నా సెబాస్టియన్, వీటీవీ గణేశ్, సప్తగిరి, మొట్టా రాజేంద్రన్ వంటి ప్రముఖ నటీనటులు ఇతర కీలక పాత్రల్లో నటించగా, మెలోడీ బ్రహ్మ మిక్కీ జే మేయర్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై ఎం. నాగ మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు.
Marriage lo red flags untaayi kaani… ikkada full red carpet eh undhi! 😵💫
Finally, every husband’s biggest horror story is here 😉#SathiLeelavathi is streaming now on JioHotstar! 💫#SathiLeelavathiOnJioHotstar@Itslavanya @ActorDevMohan @SatyaTatineni @MickeyJMeyer… pic.twitter.com/JY8nnvS7JD
— JioHotstar Telugu (@JioHotstarTel_) May 20, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

