Raj Tarun | రాజ్ లేని లైఫ్‌లో నేను ఉండలేను.. ఆత్మహత్య చేసుకుంటానని లావణ్య మెసేజ్
Raj Tarun | హీరో రాజ్‌తరుణ్ (Raj Tarun) లేని లైఫ్‌లో తాను ఉండలేనని, బతకలేనని ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ తన అడ్వకేట్‌కు లావణ్య మెసేజ్ చేసింది. శుక్రవారం అర్ధరాత్రి తన లాయర్‌కు సందేశం పంపించడంతో అప్రమత్తమైన అతడు.. వెంటనే డయల్ 112 ద్వారా నార్సింగి పోలీసులకు సమాచారం అందించారు.
Raj Tarun | హీరో రాజ్‌తరుణ్ (Raj Tarun) లేని లైఫ్‌లో తాను ఉండలేనని, బతకలేనని ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ తన అడ్వకేట్‌కు లావణ్య మెసేజ్ చేసింది. శుక్రవారం అర్ధరాత్రి తన లాయర్‌కు సందేశం పంపించడంతో అప్రమత్తమైన అతడు.. వెంటనే డయల్ 112 ద్వారా నార్సింగి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆమె ఇంటికి చేరుకున్న పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. హీరో రాజ్‌తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
తానేంటో తెలిసిన వారే తనను తప్పుబట్టారంటూ అడ్వొకేట్కు పంపిన మెసేజ్‌లో ఆవేదన వ్యక్తంచేసింది. రాజ్ లేని లైఫ్‌లో నేను ఉండలే.. బతకలేను. అన్నీ కోల్పోయాను. అందరివల్ల నేనే మోసపోయాను. రాజ్ తల్లిదండ్రులు కూడా నా చావుకు కారణం. రాజ్ మొత్తం మారిపోయాడు. నా చావును కోరుకున్నాడు. మాల్వీ మల్హోత్ర నా చావుకు ప్రధాన కారణం. నా కుటుంబం, దిలీప్ సుంకర, మీడియాకు నా క్షమాపణలు అంటూ అందులో పేర్కొంది.
పదకొండేండ్లుగా ప్రేమాయణం నడిపి తనను శారీరకంగా వాడుకుని ఇప్పుడు వదిలించుకునేందుకు యత్నిస్తున్నాడంటూ ఈ నెల 5న లావణ్య నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. హీరో రాజ్‌తరుణ్, తాను పదకొండేండ్లుగా ప్రేమించుకుంటున్నామని, అనేకసార్లు శారీరకంగా కలిశామని లావణ్య ఫిర్యాదులో తెలిపింది. ఇప్పుడు వదిలించుకునేందుకు బెదిరింపులకు పాల్పడుతున్నాడని పేర్కొంది. ఓ హీరోయిన్‌తో ప్రేమాయణం నడుపుతూ, తనను మోసం చేయాలని చూస్తున్నాడని వాపోయింది. రాజ్‌తరుణ్‌ను వదిలేయాలని లేకపోతే తనను చంపేస్తానంటూ, అతడి సోదరుడు ఫోన్లో బెదిరింపులకు పాల్పడుతున్నాడని వెల్లడించింది.
గతంలో డ్రగ్స్ కేసులో తనను ఇరికించారని, రాజ్‌తరుణ్ కోసం తాను 45 రోజులపాటు జైలులో ఉన్నానని తెలిపింది. రాజ్‌తరుణ్ విచ్చలవిడిగా డ్రగ్స్‌కు అలవాటుపడి అమ్మాయిలతో పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తున్నారంటూ 4 పేజీల ఫిర్యాదును పోలీసులకు అందజేసింది. కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎక్కువ ఈఎంఐ కట్టడమా?.. కాల వ్యవది పెంచుకోవమా?.. ఆర్బీఐ వడ్డీరేటు పెంచిన తరువాత ఏది బెటర్
Trishula Snanarchana | వేయిస్తంభాల ప్రాచీనకోనేరులో త్రిశూలస్నానార్చన
Theft Attempt | దొంగతనం చేసేందుకు సీసీ కెమెరాను బ్లర్ చేశారు.. కానీ ఏమైందో చూడండి.. వీడియో
AP News | ఏపీలో పలుచోట్ల టీడీపీ, వైసీపీ వర్గీయుల బాహాబాహీ..!
‘ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు అధిక ఆదాయం’
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

