Salaar | సలార్-2 నుంచి అదిరిపోయే అప్డేట్.. డైలాగ్ ప్రోమో వదిలిన ప్రశాంత్ నీల్
Salaar | సలార్ పార్ట్-1 సీజ్ఫైర్ విడుదల తర్వాత బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. ఈ సినిమా చివరలోనే సలార్-2 గురించి అనౌన్స్ చేయడంతో శౌర్యాంగ పర్వంపై అంచనాలు మరింతగా పెరిగాయి. సెకండ్ పార్ట్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని అంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
Salaar | కేజీఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ ఒకరు.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన యాక్టర్ ఇంకొకరు.. వీళ్లిద్దరూ కలిస్తే ఇంకేమైనా ఉందా.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగాల్సిందే! ప్రభాస్ కటౌట్‌కి.. ప్రశాంత్ నీల్ టేకింగ్కి ప్రేక్షకులకు పూనకాలు రావాల్సిందే! సలార్ సినిమా విడుదలకు ముందు అందరికీ ఇదే అనిపించింది. అన్నట్టుగానే సలార్ పార్ట్-1 సీజ్ఫైర్ విడుదల తర్వాత బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. ఈ సినిమా చివరలోనే సలార్-2 గురించి అనౌన్స్ చేయడంతో శౌర్యాంగ పర్వంపై అంచనాలు మరింతగా పెరిగాయి. సెకండ్ పార్ట్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని అంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి టైమ్‌లో హోంబలే ఫిలింస్ ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చింది.
సలార్-2 కి సంబంధించిన డైలాగ్ ప్రోమోను వదిలింది. శౌర్యాంగపర్వంలో ఎలాంటి అంశాలు ఉండొచ్చనే విషయాలపై హింట్ ఇస్తూ ఒక వీడియోను కాసేపటి క్రితం విడుదల చేసింది. అందులో ‘ ఒక పక్క ఆ కుర్చీ కోసం మొత్తం ఖాన్సర్ యుద్ధం చేయడానికి సిద్ధమైంది. ఇంకోపక్క వేలమంది శౌర్యాంగులు ఆ కుర్చీని తగలబెట్టేందుకు సిద్ధమయ్యారు. కానీ దేవా.. అదే కుర్చీని వరదకు ఇస్తానని మాటిచ్చాడు. కానీ.. దాని మీద కూర్చునే హక్కు దేవాది.’ అంటూ సాగిన డైలాగ్ ప్రోమో అదిరిపోయింది. ఖాన్సర్ కుర్చీ మీద దేవా కూర్చుంటాడా? ఇచ్చిన మాట కోసం వరద వెనుక నిలబడతాడా? అనే సందేహంతో పార్ట్2పై ఈ ప్రోమో క్యూరియాసిటీని పెంచేసింది. 34 సెకండ్ల నిడివితో ఉన్న ఈ ప్రోమో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

