Lakshmi Manchu | నటిగా, నిర్మాతగా అందరికీ పెద్దగా పరిచయం అక్కర్లేని భామ మంచు లక్ష్మీప్రసన్న (Lakshmi Manchu). అనగనగా ఓ ధీరుడు సినిమాతో తొలిసారి తెలుగు సిల్వర్ స్క్రీన్‌పై నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెరిసింది. ఆ తర్వాత పలు సినిమాల్లో పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నిర్మాతగా కూడా పలు సినిమాలు తెరకెక్కించిన ఈ మంచు వారమ్మాయి గతేడాది మాన్స్టర్ (Moster) సినిమాతో మలయాళంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.
తెలుగులో చివరగా నెట్‌ఫ్లిక్స్ అంథాలజీ పిట్టకథలు చిత్రంలో మెరిసింది. తెలుగులో చేస్తున్న సినిమాలు ఈ భామకు చాలా కాలంగా ఆశించిన స్థాయిలో బ్రేక్ ఇవ్వలేకపోయాయి. దీంతో లక్ష్మీ ప్రసన్న తన ఫోకస్‌ను హిందీవైపు మళ్లించిందన్న వార్త ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో లక్ష్మీప్రసన్న తన మకాంను ముంబై (Mumbai)కి మార్చేసిందని ఇన్సైడ్ టాక్. కొత్త సిటీ.. కొత్త శకం.. కొత్త జీవితం పట్ల చాలా సంతోషంగా ఉన్నా. నన్ను ఎప్పుడూ సపోర్టు చేస్తూ.. నాపై నమ్మకం ఉంచిన నా అభిమానులకు ధన్యవాదాలు.. అని క్యాప్షన్ ఇచ్చింది.
అంతేకాదు ముంబైలోనే తన బర్త్ డే వేడుకలు జరుపుకొని.. వీడియోలు కూడా పోస్ట్ చేసింది మంచు లక్ష్మి. బర్త్ డే ఈవెంట్‌కు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరవడంతో.. ఇక మంచు వారి బ్యూటీ హిందీ ప్రాజెక్టులపైనే ఫుల్ ఫోకస్ పెట్టాలని ఫిక్స్ అయిందంటూ తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు.