Lahari: ఎలిమినేట్ అయిన లహరి.. వెళ్లిపోతూ ఫుల్ క్లాస్ పీకిన అమ్ము

బిగ్ బాస్ హౌజ్‌లోకి చాలా కాన్ఫిడెంట్‌గా వచ్చి టైటిల్ దక్కించుకోవాలని గట్టిగా ప్రయత్నించింది లహరి( అమ్ము). ఈ అమ్మడు ఐదారు వారాలు అయిన ఉంటుందని అందరు ఊహించారు. కాని మూడో వారమే అన్ని సర్ధుకొని బయటకు వచ్చింది. లహరి ఎలిమినేషన్‌కు ముఖ్య కారణం ప్రియ, రవి. వీళ్లిద్దరూ తెలిసో, తెలియకో ప్రేక్షకుల ముందు లహరిని బ్యాడ్ చేశారు.
యాంకరింగ్ కోసం తన వెనకాల పడుతుందని రవి, ఇంట్లో మగాళ్లతో బిజీ అని ప్రియ కామెంట్లు చేయడంతో ఆమె మీద కొంత వ్యతిరేకత ఏర్పడింది. అదే సమయంలో ఆమె అన్యాయంగా బలవుతుందంటూ కొంత సానుభూతి ఏర్పడ్డప్పటికీ అది ఆమెను ఎలిమినేషన్ నుంచి గట్టెక్కించలేకపోయాయి. స్టేజీ మీదకు వచ్చిన లహరి.. శ్రీరామ్ తనకోసం ఓ పాట పాడాలంది. దాంతో ఆయన ఎటో వెళ్లిపోయింది మనసు పాట పాడాడు.
ఇక లహరి తన మనసులో ఇంటి సభ్యులపై ఎలాంటి ఒపీనియన్స్ ఉందో చెప్పుకొచ్చింది. సిరికి వేరే అమ్మాయింటే కొంత భయం అని, అనీ మాస్టర్.. స్వీట్ అని, యాంకర్ రవి, కాజల్‌లకు కెమెరాలున్నాయి, బీకేర్‌ఫుల్ అని హెచ్చరించింది. ఇక ప్రియని ఏదైన మాట్లాడే ముందుకు ఆలోచించి మాట్లాడమని హెచ్చరించింది. విశ్వ స్ట్రాంగ్‌గా ఉండు, లోబో నీ ఈక్వేషన్స్ మారిపోయాయి.
టరాజ్ మాస్టర్.. భోళా శంకరుడని, శ్వేత.. స్ట్రాంగ్‌గా ఉండాలని చెప్పింది. ఇక షణ్ముఖ్ సమయం వచ్చేసరికి.. సిరి నామినేట్ చేసిందని నామినేట్ చేశావ్, ఏంట్రా ఇది? అని షణ్నును ప్రశ్నించింది. అందుకు అతనికి ఒళ్లు మండింది.సిరితో దూరంగా ఉన్నా ఇలా అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక జెస్సీ.. చిన్నపిల్లోడని, ఎవరినో ఒకరిని ఫాలో అవ్వాలని చూస్తున్నాడంది. సన్నీ.. ఇంట్లో ప్రతిఒక్కటీ తనే పట్టించుకుంటాడు. అంత షార్ప్ కాదు. హమీద స్ట్రాంగ్ లేడీ అని చెప్పి బిగ్ బాస్ హౌజ్‌కి గుడ్ బై చెప్పింది లహరి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

