సాయిరోనాక్, ప్రగ్యా నగ్రా జంటగా నటిస్తున్న చిత్రం ‘లగ్గం’. రమేష్ చెప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. వేణుగోపాల్ రెడ్డి నిర్మాత. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘తెలంగాణలో జరిగే పెళ్లి ఘట్టాన్ని కన్నుల పండువగా ఈ సినిమాలో చూపించబోతున్నాం. పెళ్లి కాన్సెప్ట్‌పై గతంలో చాలా చిత్రాలొచ్చాయి.
అందుకు భిన్నంగా ‘లగ్గం’ ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుంది. తెలంగాణదనం ఉట్టిపడే పెళ్లి కథ ఇది’ అన్నారు. కొన్ని తరాలు గుర్తుంచుకునే చిత్రమవుతుందని నిర్మాత వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. రాజేంద్రప్రసాద్, రోహిణి, సప్తగిరి, ఎల్బీ శ్రీరామ్, కృష్ణుడు, రఘుబాబు, రచ్చ రవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బాల్‌రెడ్డి, సంగీతం: చరణ్ అర్జున్, దర్శకత్వం: రమేష్ చెప్పాల.