Kushi Movie | ఓటీటీలోకి వచ్చేసిన ఖుషీ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Kushi Movie | ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని డిజిటల్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా గత అర్థ రాత్రి నుంచి ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది.
Kushi Movie | లైగర్ వంటి అల్ట్రా డిజాస్టర్ పడినా ఖుషీ సినిమాకు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ సాధించాడు విజయ్ దేవరకొండ. నిజానికి ఈ సినిమాకు ముందు నుంచి పాజిటీవ్ హైపే నెలకొంది. దానికి తోడు పాటలు, ట్రైలర్ ఒక దానికి మించి మరొకటి జనాల్లో తిరుగులేని హైప్ నెలకొల్పాయి. సెప్టెంబర్ 1న సోలోగా రిలీజైన ఈ సినిమాకు మరీ అంత పాజిటీవ్ రివ్యూలు ఏమి రాలేవు కానీ.. ఒక్కసారి హ్యాపీగా చూసేయొచ్చు అనే టాక్ మాత్రం తెచ్చుకుంది. దాంతో ఫ్యామిలీ ఆడియెన్స్ సహా యూత్ థియేటర్ల వైపు పరుగులు తీశారు. తొలిరోజు రూ.30 కోట్ల రేంజ్లో కలెక్షన్లు కొల్లగొట్టి విజయ్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి నిరూపించాడు. ఇక వరుసగా రెండు, మూడు రోజులు ఊహించని రేంజ్లో కలెక్షన్లు కొల్లగొట్టింది.
అయితే వీక్ డేస్లో మాత్రం ఈ సినిమా మరీ వీక్ అయిపోయింది. ఎంతలా ఉంటే మూడు రోజుల్లో రూ.70 కోట్లు కొల్లగొట్టిన సినిమా.. ఆ తర్వాత పట్టు మని పది కొట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది. ఫైనల్ రన్లో దాదాపు రూ.12 కోట్లు నష్టాన్ని మిగిల్చిందని ఇన్సైడ్ టాక్. ఇక ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని డిజిటల్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా గత అర్థ రాత్రి నుంచి ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించింది. మైత్రీ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వాహద్ స్వరాలు సమకూర్చాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

