Kushi Movie | గీతాగోవిందం తర్వాత ఆ స్టాంప్ ఖుషీకే.. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు పండుగే పండగ..!
Vijay Devarakonda | అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ నుంచి సినిమా వస్తుందనగానే అందరికీ స్ట్రయిక్ అయ్యేది అసభ్య పదజాలం, అశ్లీలం, యాటిట్యూడ్ ఇలా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు పొంతనలేని అంశాలన్ని ఉంటాయని అంటుంటారు.
Vijay Devarakonda | అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ నుంచి సినిమా వస్తుందనగానే అందరికీ స్ట్రయిక్ అయ్యేది అసభ్య పదజాలం, అశ్లీలం, యాటిట్యూడ్ ఇలా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు పొంతనలేని అంశాలన్ని ఉంటాయని అంటుంటారు. ఇవన్నీ ఏ హీరో సినిమాలో లేవా అంటే ఖచ్చితంగా ఉంటాయి. అయితే అర్జున్ రెడ్డి ప్రభావం ప్రేక్షకుల్లో బాగా కూరుకుపోయింది. ఎన్ని సినిమాలు చేసిన విజయ్ ఇంకా అర్జున్ రెడ్డి క్యారెక్టర్లోంచి బయటకు రాలేడనే అంటుంటారు. మధ్యలో గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలతో ఆ మచ్చ పోగొట్టుకునే ప్రయత్నం చేసిన వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ వంటి సినిమాలు మళ్లీ అర్జున్ రెడ్డిని గుర్తుచేశాయి. ఇక చాలా రోజుల తర్వాత ఖుషీ సినిమాతో విజయ్ నుంచి ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ వస్తుంది.
ఇప్పటికే ఈ సినిమాపై వీర లెవల్లో అంచనాలున్నాయి. పోస్టర్లు, ట్రైలర్లు గట్రా ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ఓ రేంజ్లో హైప్ తీసుకొచ్చాయి. ఇక ఇవన్నీ ఒకెత్తయితే మొన్న జరిగిన ఖుషీ మ్యూజిక్ కాన్సర్ట్‌లో విజయ్, సమంతల లైవ్ పర్ఫార్మెన్స్ ఊహించని రేంజ్లో బజ్‌ను తెచ్చిపెట్టింది. దర్శకుడు నిర్వాణ సైతం సినిమాకు వచ్చిన కపుల్ జంటలకు మాత్రం మరిచిపోలేని జ్ఞాపకాలు తీసుకుపోతారని ఓ హెవీ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఇంకేముంది ఆ ఒక్క మాటతో సినీ లవర్స్ ఈ సినిమాపై చాలా పాజిటీవ్‌గా ఉన్నారు. సెప్టెంబర్ 1న గ్రాండ్‌గా థియేటర్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా తాజాగా సెన్సార్‌ను పూర్తి చేసుకుంది.
ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చేశారు. అంటే ఎలాంటి అసభ్యాలు ఈ సినిమాలో ఉండవని.. పిల్లలతో కలిసి హ్యాపీగా చూడొచ్చని సెన్సార్ తీర్మానించేసింది. విజయ్ కెరీర్లో ఇలా క్లీన్ యూ సర్టిఫికేట్ పొందిన రెండో సినిమాగా ఖుషీ నిలిచింది. మొదటిది గీతాగోవిందం. ఈ రెండు సినిమాలు తప్పితే విజయ్ సినిమాలన్ని ఏ లేదంటే యూ/ఏ సర్టిఫికేట్ పొందినవే. నిన్నుకోరి, మజిలీ సినిమాల తరహాలోనే శివ నిర్వాణ ఈ సినిమాను ఫ్యామిలీ ఆడియెన్స్ కోసమే వడ్డించబోతున్నాడు. ఇక అప్పుడు గీతాగోవిందంతో బంపర్ హిట్టు సాధించినట్లే.. ఇప్పుడు ఖుషీ కూడా ఊహించని రేంజ్లో హిట్టవుతుందని రౌడీ ఫ్యాన్స్ దీమాగా ఉన్నారు.
ఇప్పటికే బిజినెస్ లెక్కల కోటలు దాటేశాయని ఇన్సైడ్ టాక్. లైగర్ వంటి భారీ డిజాస్టర్ ఇచ్చినా.. డిస్ట్రిబ్యూటర్లు మాత్రం ఖుషీ సినిమా కోసం పోటీ పడుతున్నారటి. లెక్కలు బయటకు రావట్లేదు కానీ.. ప్రీ బిజినెస్ రూ.60 కోట్లు దాటిందని తెలుస్తుంది. విజయ్ లాంటి టైర్-2 హీరోకు ఈ రేంజ్ బిజినెస్ జరగడం అంటే విశేషం అనే చెప్పాలి. విజయ్ క్రేజ్‌కు శివ నిర్వాణ బలం తోడవటంతో ఈ స్థాయిలో బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. అదీ కాకుండా పోస్టర్లు, ట్రైలర్లలో సమంత, విజయ్‌ల కెమెస్ట్రీ కూడా బాగానే వర్కవుట్ అయినట్లు కనిపిస్తుంది. సోలోగా వస్తుండటం ఈ సినిమాకు బాగా ప్లస్ అయింది. ఈ సినిమా తర్వాత వారినికి జవాన్ రిలీజవుతుంది. జవాన్‌పై మంచి అంచనాలే ఉన్నాయి కానీ.. మరీ ఆహో ఓహో అనే రేంజ్లో లేవు. దాంతో ఖుషీకి కాస్త పాజిటీవ్ టాక్ వచ్చినా ఈజీగా కోట్లు కొల్లగొడుతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

