చిన్ననాటి అందమైన జ్ఞాపకాలను గుర్తుకు తెస్తూ వినోదప్రధానంగా రూపొందిస్తున్న బాలల చిత్రం ‘సమ్మర్ హాలీడేస్’. మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీకర్ దర్శకత్వంలో ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం బాలనటి, ‘మనశంకర వరప్రసాద్‌గారు’ ఫేమ్ ఖుషి పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ప్రతి ఒక్కరికి వేసవి సెలవుల్లోని బాల్య జ్ఞాపకాలను గుర్తుకు తెస్తూ ఆద్యంతం నాస్టాల్జిక్ ఫీల్‌తో సాగే సినిమా ఇదని, చక్కటి వినోదంతో అలరిస్తుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సింజిత్ యెర్రమల్లి, నిర్మాణ సంస్థ: ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్, కథ, దర్శకత్వం: శ్రీకర్.