Kumari Srimathi | నిత్యామీనన్ ‘కుమారి శ్రీమతి’ ట్రైలర్ అప్డేట్.. ఎప్పుడంటే?
Nithya Menen | ‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగపెట్టింది మలయాళ బ్యూటీ నిత్యామీనన్(Nithya Menon). తొలి సినిమాతోనే తిరుగులేని పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో అనతికాలంలోనే అగ్ర కథానాయికగా పేరు సంపాదించుకుంది.
Nithya Menen | ‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగపెట్టింది మలయాళ బ్యూటీ నిత్యామీనన్(Nithya Menon). తొలి సినిమాతోనే తిరుగులేని పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో అనతికాలంలోనే అగ్ర కథానాయికగా పేరు సంపాదించుకుంది. ఆ మధ్య కాస్త డల్ అయినట్లు కనిపించినా.. ‘భీమ్లానాయక్’, ‘తిరు’ సినిమాలతో మళ్లీ తిరిగి హిట్ ట్రాక్‌లోకి వచ్చేసింది. ఇక ప్రస్తుతం నిత్యామీనన్ చేస్తున్న వెబ్ సిరీస్ ‘కుమారి శ్రీమతి’(Kumari Srimathi). లేడి ఓరియెంట్ కాన్సెప్ట్‌లో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్‌కు గోమతేష్ ఉపాధ్యాయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి గ్లింప్స్, టీజర్ విడుదల చేసిన మేకర్స్ తాజాగా ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు.
‘కుమారి శ్రీమతి’(Kumari Srimathi) ట్రైలర్‌ను ఈరోజు సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇక ఈ ట్రైలర్‌ను టాలీవుడ్ స్టార్ హీరో నాచురల్ స్టార్ నాని లాంచ్ చేయనున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉంటే.. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించారు. స్వప్న సినిమాస్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అవసరాల శ్రీనివాస్ ఈ వెబ్ సిరీస్‌కు కథను అందించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

