బాలీవుడ్ (Bollywood) దర్శకనిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న పాపులర్ ఓటీటీ సెలబ్రిటీ టాక్ షో కాఫీ విత్ కరణ్ (Koffee With Karan Season 7) సీజన్ -7లో సెలబ్రిటీల సందడి కొనసాగుతోంది. తాజాగా తొమ్మిదో ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేయగా నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ ఎపిసోడ్లో టైగర్ ష్రాఫ్ ( Tiger Shroff) , కృతిసనన్ (Kriti Sanon) సందడి చేశారు.
హీరోపంతి సినిమాతో డెబ్యూ ఇచ్చిన ఈ ఇద్దరు కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాయి. టైగర్ ష్రాఫ్ ఎక్కువ పంచ్‌లు విసరడం వల్ల అతనితో డేటింగ్ చేయనని కృతి సనన్ చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు రన్వీర్ సింగ్ గురించి అసూయ పడే విషయమేదైనా ఉందా..? అంటే.. ‘అతని భార్య ‘ అంటూ రిప్లై ఇచ్చాడు టైగర్ ష్రాఫ్. అదేంటి అని అంతా అనుకునే లోపే ఆమె (దీపికాపదుకొనే) అందంగా ఉండటమే కాదు టాలెంటెడ్ పర్సన్ అని చెప్పాడు.
కాఫీ విత్ కరణ్ తాజా ఫుల్ ఎపిసోడ్ గురువారం డిస్నీ+హాట్ స్టార్‌లో ప్రీమియర్ కానుంది. ఈ షోలో ఇప్పటికే సమంత , విజయ్ దేవరకొండతోపాటు అక్షయ్ కుమార్ సందడి చేశారు.