Krithi Shetty | మహారాణిలా కనిపించాలి.. అదే నా డ్రీమ్ రోల్: కృతిశెట్టి
‘జయాపజయాల గురించి పెద్దగా ఆలోచించను. మనచేతిలో లేని విషయాల గురించి పట్టించుకోకపోవడమే బెటర్ అనుకుంటా’ అని చెప్పింది కృతిశెట్టి. ఆమె శర్వానంద్ సరసన నటిస్తున్న తాజా చిత్రం ‘మనమే’. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. జూన్ 7న ప్రేక్షకుల ముందుకురానుంది.
‘జయాపజయాల గురించి పెద్దగా ఆలోచించను. మనచేతిలో లేని విషయాల గురించి పట్టించుకోకపోవడమే బెటర్ అనుకుంటా’ అని చెప్పింది కృతిశెట్టి. ఆమె శర్వానంద్ సరసన నటిస్తున్న తాజా చిత్రం ‘మనమే’. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. జూన్ 7న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కృతిశెట్టి మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నా పాత్ర పేరు సుభద్ర. తను ప్రతి విషయంలో క్రమశిక్షణతో ఉంటుంది. నేను ఇప్పటివరకు చలాకీగా, సున్నితమనస్కురాలైన అమ్మాయి పాత్రల్లోనే ఎక్కువగా నటించాను. కానీ అందుకు భిన్నంగా ‘మనమే’లో నా పాత్ర కొత్త కోణంలో సాగుతుంది. ఈ కథలో హార్ట్‌టచింగ్ ఎమోషన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే యూనివర్సల్ కాన్సెప్ట్ ఇది. తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉండే అనుబంధం హృద్యంగా అనిపిస్తుంది’ అని చెప్పింది.
తన డ్రీమ్ రోల్ గురించి మాట్లాడుతూ “బాహుబలి’ సినిమాలో అనుష్క తరహాలో ప్రిన్సెస్ పాత్రలు చేయడం చాలా ఇష్టం. అలాగే యాక్షన్, మార్షల్ ఆర్ట్స్ నేపథ్యం ఉన్న రోల్స్ చేయాలని ఉంది’ అని తెలిపింది. ప్రస్తుతం తమిళ, మలయాళ భాషల్లో ఒక్కో సినిమా చేస్తున్నానని, ఫెయిల్యూర్స్ గురించి పెద్దగా ఆలోచించకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంపైనే దృష్టిపెట్టానని కృతిశెట్టి పేర్కొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లి మండలంలో నీట మునిగిన పత్తి, వరి పంటలు
ACB Raid | రూ. 40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై
కృష్ణసాగర్‌లో జన జాతీయ గౌరవ దీవస్ పక్షోత్సవాలు
RS Praveenkumar | శేరిలింగంపల్లిలో ప్రభుత్వ భూమి కబ్జా.. సాక్ష్యాధారాలతో బయటపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
అన్నదాతపై అశనిపాతం.. కన్నీరు పెట్టిస్తున్న ‘మురసు’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

