చిరంజీవి లేకపోతే నాగబాబు ఎవరు.. మరోసారి రెచ్చిపోయిన కోట శ్రీనివాసరావు

kota srinivasa rao vs nagababu | ఈ మధ్య కాలంలో సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు చేస్తున్న వ్యాఖ్యలు తెలుగు ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్నాయి. మరీ ముఖ్యంగా మా ఎన్నికల సందర్భంగా ఆయన చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పటికీ వేడి రాజేస్తున్నాయి. అధ్యక్షుడిగా పోటీలోకి దిగిన ప్రకాశ్ రాజ్ క్రమశిక్షణపై ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. తాను ప్రకాశ్ రాజ్ కలిసి 15 సినిమాలకు పైగా నటించామని.. ఒక్కసారి కూడా ఆయన షూటింగ్‌కు సమయానికి రాలేదని.. అలాంటి వ్యక్తిని అధ్యక్షుడిగా గెలిపిస్తే ఏం చేస్తాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు కోట శ్రీనివాసరావు. ఈ వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు సీరియస్‌గా స్పందించాడు. కొంతమందికి వయసు పెరుగుతుంది కానీ బుద్ధి పెరగదు.. రేపోమాపో పోయే కోట ఇంకా ఎప్పుడు మారతాడు అంటూ తీవ్ర పదజాలంతో కాస్త నోటి దురుసు చూపించాడు. దీనిపై ఇండస్ట్రీలో ఉన్న పలువురు పెద్దలు కూడా నాగబాబు వ్యాఖ్యలను తప్పుబట్టారు. అయితే నాగబాబు కామెంట్స్‌పై అప్పుడు కోట ఏమీ స్పందించలేదు. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కోట శ్రీనివాసరావు.. నాగబాబు కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చాడు.
నాగబాబు గురించి కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మెగా బ్రదర్ అనే గుర్తింపు తప్ప నాగబాబు కి ఏం గుర్తింపు ఉందని ప్రశ్నించారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ లేకపోతే ఆయన్ను ఎవరు పట్టించుకోరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గతంలో తనపై నాగబాబు కామెంట్స్ చేసినప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదని.. తాను కూడా నాగబాబులా నోరు జారి ఉంటే టీవీలో డిబెట్లకు ఆ టాపిక్ వచ్చేదని చెప్పుకొచ్చాడు. అనవసరంగా ఆయన గురించి మాట్లాడనని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చాడు. మరి కోట వ్యాఖ్యలపై నాగబాబు ఎలా స్పందిస్తాడో చూడాలి.ఇటీవల యాంకర్ అనసూయ భరద్వాజ్ ( Anasuya Bharadwaj )పై కోట శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈమె మంచి నటి కానీ అలాంటి బట్టలు వేసుకోవడం ఎందుకు అంటూ అనసూయపై కామెంట్ చేశాడు. దీనిపై అనసూయ కూడా ఘాటుగానే స్పందించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
MAA Elections | ‘మా’ ఎన్నికలపై నాగబాబు కీలక వ్యాఖ్యలు.. కోట, బాబుమోహన్‌పై ఫైర్
Anasuya Bharadwaj | కోటకు యాంకర్ అనసూయ ఘాటు రిప్లయి.. ఎందుకంటే?!
ఆ సినిమా తీసినందుకు ఈవీవీని అంతలా తిట్టారా.. సంచలన విషయాలు బయటపెట్టిన కోట
Kota srinivasa rao : నమస్కారం చెప్పా, వెంటనే బాలయ్య నాపై ఉమ్మాడు: కోట
జంధ్యాల అహ నా పెళ్లంటలో కోట పాత్రకు ముందుగా ఎవర్ని అనుకున్నారో తెలుసా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

