తమకు భాషా హద్దులు లేవంటూ అన్ని ఇండస్ట్రీల సినిమాలు చేసేస్తుంటారు నాయికలు. ఈ క్రమంలో తారల సినిమాలు ఒకరివి మరొకరికి చేతులు మారుతుంటాయి. దీనికి డేట్స్ అడ్జెస్ట్మెంట్ సహా అనేక కారణాలు ఉండొచ్చు. ఇలా రష్మిక మందన్న తాజా చిత్రమొకటి వదులుకోవాల్సివచ్చింది.
ఆమె విక్రమ్ సరసన నటించాల్సిన సినిమా కోలీవుడ్ బ్యూటీ మాళవికకు దక్కింది. పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ నటిస్తున్న సినిమా ఇటీవలే షూటింగ్ ప్రారంభించుకుంది. ఈ సినిమాకు మొదట రష్మికను నాయికగా అనుకోగా ఆమె డేట్స్ క్లాష్ కావడంతో ఈ భారీ చిత్రంలో నటించే అవకాశాన్ని మాళవిక దక్కించుకుంది.