స్వీయ దర్శకత్వంలో ప్రతాని రామకృష్ణ గౌడ్ రూపొందించిన చిత్రం ‘ఆర్కే దీక్ష’. కిరణ్, ఆక్సఖాన్, అలేఖ్య ప్రధాన పాత్రల్లో నటించారు. జూన్ 12న ప్రేక్షకుల ముందుకురానుంది. గురువారం దర్శకనిర్మాత ఆర్.కె.గౌడ్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం టీజర్‌తో పాటు పాటలను విడుదల చేశారు. అకుంఠిత దీక్షతో ఏదైనా కార్యాన్ని సంకల్పిస్తే విజయం తథ్యమనే సందేశాన్ని అందించే చిత్రమిదని, వీర జవాన్ మురళీనాయక్ గొప్పతనాన్ని తెలియజేసేలా ఓ ప్రత్యేకమైన పాటను రూపొందించామని, సందేశం ప్రధానంగా ఈ సినిమా మెప్పిస్తుందని ఆర్.కె.గౌడ్ తెలిపారు.
మంచి కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారని సీనియర్ నటుడు సుమన్ ప్రశంసించారు. సైనికుల ధైర్యసాహసాలను ఆవిష్కరించే ఓ పాట సినిమాలో హైలైట్‌గా నిలుస్తుందని నటి తులసి చెప్పింది. ఈ చిత్రానికి సంగీతం: రాజ్‌కిరణ్, సమర్పణ: డీఎస్ రెడ్డి, దర్శకత్వం, నిర్మాణం: ప్రతాని రామకృష్ణగౌడ్.