Kiran Abbavaram | హిట్టు కొట్టిన కిరణ్ అబ్బవరం.. రూ.50 కోట్ల క్లబ్లో ‘క’ మూవీ
Kiran Abbavaram | చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుంది క చిత్రం. టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు సుజీత్, సందీప్ ఇద్దరు దర్శకులు సంయుక్తంగా దర్శకత్వం వహించగా.. కిరణ్ అబ్బవరం సోంత బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాను చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
Kiran Abbavaram | చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుంది క చిత్రం. టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు సుజీత్, సందీప్ ఇద్దరు దర్శకులు సంయుక్తంగా దర్శకత్వం వహించగా.. కిరణ్ అబ్బవరం సోంత బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాను చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. నయన్ సారిక కథానాయికగా నటించింది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.
అయితే తాజాగా ఈ చిత్రం అరుదైన రికార్డును అందుకుంది. ఈ చిత్రం తెలుగు వెర్షన్లో రూ.50 కోట్ల క్లబ్లో చేరింది. దీంతో కిరణ్ అబ్బవరం మొదటి రూ.50 కోట్ల సినిమాగా రికార్డులకెక్కింది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అభినయ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) అనాథ. ఎప్పటికైనా తన తల్లిదండ్రులు తిరిగొస్తారన్న ఆశతో జీవిస్తుంటాడు. ఇతరుల ఉత్తరాలు చదువుతూ.. వాటిని తన సొంత వాళ్లే రాసినట్లు ఊహించుకుంటూ.. ఆ రాతల్లో తాను పోగొట్టుకున్న బంధాల్ని చూసుకుంటాడు. ఈ ఆనందం రోజూ ఉండాలని, తనో పోస్ట్‌మ్యాన్ కావాలని నిశ్చయించుకుంటాడు. ఆ అలవాటులో భాగంగా శరణాలయం వార్డెన్ ఉత్తరం చదువుతూ వార్డెన్‌కి దొరికిపోతాడు. అతను వాసుదేవ్‌ని కొట్టి, మందలించి వదిలిపెట్టేస్తాడు. ఓ రోజు వార్డెన్ దగ్గరున్న డబ్బును దొంగిలించి, శరణాలయం నుంచి పారిపోతాడు వాసుదేవ్. తన కూతురు ఆపరేషన్‌కోసం వార్డెన్ దాచుకున్న డబ్బు అది. ఆ డబ్బు పోవడంతో వార్డెన్ షాక్‌కి గురవుతాడు. ఆపరేషన్ జరగకపోవడంతో అతని కూతురు చనిపోతుంది. ఇవేమీ పారిపోయిన వాసుదేవ్‌కి తెలీదు. తాను ఆ డబ్బుతో వేరే ఊరు చేరుకొని తన ఆశయసాధన కోసం టెన్త్ వరకూ చదువుపూర్తి చేస్తాడు. కృష్ణగిరి అనే ఊళ్లో అసిస్టెంట్ పోస్ట్‌మ్యాన్ ఉద్యోగం ఖాళీగా ఉందని తెలిసి, ఆ ఊరు చేరుకుంటాడు. ఇక అక్కడ ఎదురైన పరిణామాలేంటి? అసలు వాసుదేవ్ ఆ జైల్లో ఎందుకు పడ్డాడు? అతడ్ని ఇంటరాగేట్ చేస్తున్న వాళ్లు ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానమే అసలు కథ.
Naku telisina Nenu Manchi Naku teliyani Nenu ☺️#KA pic.twitter.com/AGhSnIdRqS
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) November 15, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి’
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
‘కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు కొనసాగించాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

