Ka Movie | మాలో హీరోతో రొమాన్స్ చేసింది ఎవరంటే..
కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన పీరియాడిక్ థ్రిల్లర్ ‘క’. సుజీత్, సందీప్ కలిసి దర్శకత్వం వహించారు. చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మాత. ఈ నెల 31న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇందులోని కథానాయికలు నయన్సారిక, తన్వీ రామ్ ఆదివారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు.
Ka Movie | కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన పీరియాడిక్ థ్రిల్లర్ ‘క’. సుజీత్, సందీప్ కలిసి దర్శకత్వం వహించారు. చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మాత. ఈ నెల 31న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇందులోని కథానాయికలు నయన్సారిక, తన్వీ రామ్ ఆదివారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు. నయన్ సారిక మాట్లాడుతూ ‘ ‘గం గం గణేశా’లో మోడ్రన్‌గా, ‘ఆయ్’లో ట్రెడిషనల్‌గా కనిపించా. వాటికంటే భిన్నమైన పాత్ర ‘క’లో చేశా. ఇందులో నా కేరక్టర్ పేరు సత్యభామ. ఇది 70sలో జరిగే కథ. అందుకే.. సావిత్రిగారిని ప్రేరణ తీసుకొని చేశా. ఆమెలా నేనూ గ్లిజరిన్ లేకుండా కన్నీళ్లు తెప్పించగలను. ఇందులో హీరో నన్ను ‘సావిత్రిలా ఉన్నావ్..’ అంటాడు. ఆ డైలాగ్ నా పాత్రకు రిలవెంట్గా ఉందని డైరెక్టర్స్ అన్నారు.
ఇందులో ఇద్దరు హీరోయిన్లు. మాలో హీరో పెయిర్ ఎవరు? అనేది మూవీలోనే చూడాలి. ఎన్నో మలుపులున్న కథ ఇది. యూనివర్సల్ పాయింట్, ఏ ఒక్కరికో పరిమితం కాని కథ. వాస్తవానికి దగ్గరగా పాత్రలుంటాయి.’ అని తెలిపింది. తన్వీరామ్ చెబుతూ ‘ఇందులో నా పాత్ర పేరు రాధ. నా పర్సనల్ క్యారెక్టర్‌కి భిన్నమైన పాత్ర ఇది. కథలో కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. తనొక స్కూల్ టీచర్. కిరణ్ అబ్బవరం, నయన్సారిక పాత్రలు ఓ టైమ్ ఫ్రేమ్‌లో కనిపిస్తే, నేను మరో పీరియడ్‌లో కనిపిస్తా. నా పాత్రకూ, వారి పాత్రలకూ మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి? అనేది స్క్రీన్‌పైనే చూడాలి. కృష్ణగిరి అనే ఊరు ఈ కథలో కీరోల్ ప్లే చేస్తుంది. ైక్లెమాక్స్ మరో స్థాయిలో ఉంటుంది. కథంతా ఎమోషన్సే. విడుదలయ్యాక, ‘క’ గురించి పూర్తిగా మాట్లాడతా.’ అని చెప్పుకొచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు కావాలి’
NTR | ఎన్టీఆర్ అభిమానుల తీరుపై సజ్జనార్ అసంతృప్తి.. నా ఫొటోను మార్ఫింగ్ చేశారు అంటూ ట్వీట్!
Heart Attack | మహిళల్లో పెరుగుతున్న గుండె పోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
Nana Patekar | నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు నిర్వహించారంటే.. కుమారుడు వివరణ!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

