King Nagarjuna | కింగ్ అక్కినేని నాగార్జున ప్రతిష్టాత్మక 100వ చిత్రాన్ని 2027 సంక్రాంతి బరిలో దించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో గతంలో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రకటించిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ సీక్వెల్ ప్రస్తుతానికి పక్కకు వెళ్లినట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం.
రా కార్తీక్ దర్శకత్వంలో క్రైమ్ అండ్ మనీ హీస్ట్ థ్రిల్లర్గా రూపొందుతున్న నాగ్ 100వ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయింది. ఈ ఏడాది ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు ‘జైలర్ 2’, ‘విశ్వంభర’, ‘స్వయంభు’ వంటి భారీ పాన్-ఇండియా చిత్రాలు విడుదలకు క్యూ కట్టడంతో, వాటితో పోటీ పడకుండా నేరుగా సంక్రాంతి సీజన్లో రావడమే మంచిదని నాగార్జున భావిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో చాలా కాలం తర్వాత ఈ చిత్రంలో నాగార్జున సరసన టబు నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. యంగ్ డైరెక్టర్ అయినప్పటికీ రా కార్తీక్ ఈ పీరియాడిక్ కథను, నాగార్జున విభిన్న షేడ్స్ లుక్ను అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో నాగ్ లుక్ కోసం ‘డీ-ఏజింగ్’ టెక్నాలజీని కూడా వాడుతున్నారట. దసరా కానుకగా ఈ సినిమా ఫస్ట్ టీజర్ వచ్చే అవకాశం ఉంది.