కన్నడ హీరో కిచ్చా సుదీప్ నటించిన పాన్ ఇండియా సినిమా ‘విక్రాంత్ రోణ’. జాక్వెలైన్ ఫెర్నాండేజ్, నిరూప్ భండారి, నీతా అశోక్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సమర్పణలో శాలిని ఆర్ట్స్ బ్యానర్‌పై శాలిని మంజునాథ్, జాక్ మంజునాథ్ నిర్మించారు. త్రీడీ ఫార్మాట్లో దర్శకుడు అనూప్ భండారి రూపొందించిన ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. తాజాగా ఈ చిత్ర సక్సెస్‌మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో సుదీప్ మాట్లాడుతూ…‘తెలుగు సినీ పరిశ్రమ నాకు మరో ఇళ్లు లాంటిది. ఇక్కడి ప్రేక్షకులు సినిమా నచ్చితే అద్భుత విజయాలు అందిస్తారు.
మా సినిమా విడుదల సమయంలో నాగార్జున, అఖిల్, రాజమౌళి, ఆర్జీవీ లాంటి వాళ్లంతా సపోర్ట్ చేశారు. మా చిత్రానికి మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్ చెబుతున్నా’ అన్నారు. దర్శకుడు అనూప్ భండారి మాట్లాడుతూ..‘రెండు దశాబ్దాలుగా కెరీర్ సాగిస్తున్నా..ఈ సినిమాలో ఓ కొత్త హీరోలాగా సుదీప్ నటించారు. కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు చేసేప్పుడు గాయపడ్డారు. అయినా అదే స్ఫూర్తితో నటించి మాలోనూ ఉత్సాహాన్ని నింపారు. మా సినిమా కొత్త అనుభూతిని ఇచ్చిందని ఇవాళ ప్రేక్షకులు చెప్పడం సంతోషంగా ఉంది’ అన్నారు.