Kiara Advani | రాంచరణ్ (Ram Charan), శంకర్ (Shankar) క్రేజీ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఆర్సీ 15 (RC15). బాలీవుడ్ భామ కియారా అద్వానీ (kiara advani) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. కాగా ఇప్పటికే వచ్చిన వార్తల ప్రకారం రాంచరణ్, కియారా అద్వానీపై వచ్చే సాంగ్ షూట్ చేయాల్సి ఉండగా.. కియారా వెడ్డింగ్ కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయింది. శంకర్ టీం నుంచి షూటింగ్ అప్డేట్ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే కియారా అద్వానీ ఓ ఇంటర్వ్యూలో కోస్టార్ రాంచరణ్‌తో కలిసి పనిచేయడం గురించి తన అభిప్రాయాన్ని పంచుకుంది.
రాంచరణ్‌తో పనిచేయడం ఎప్పుడూ లవ్లీగా ఉంటుందని అంటోంది కియారా అద్వానీ. రాంచరణ్ మంచి యాక్టర్ మాత్రమే కాదు.. మంచి డ్యాన్సర్ కూడా. ఆర్సీ 15లో రాంచరణ్‌ను, నన్ను చాలా కొత్త కోణంలో చూస్తారు. శంకర్ సిల్వర్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేసే అద్భుతమైన దర్శకుడని కితాబిచ్చింది. సినిమాలో నా పోర్షన్‌కు సంబంధించిన షూటింగ్‌ను ఇదే నెలలో మొదలు పెడతా. సినిమాలో చాలా మంది యాక్టర్లుండబోతున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నప్పటికీ రాంచరణ్‌లో ఎలాంటి మార్పు రాలేదు. రాంచరణ్ ఎంతో వినయ పూర్వకమైన వ్యక్తి. ఈ లక్షణాలే ఆయన్ను స్టార్‌గా నిలబెట్టాయని చెప్పుకొచ్చింది కియారా అద్వానీ.
పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, రాజోలు భామ అంజలి ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర, జయరాయ్, సునీల్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు.
Kushi | ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఖుషి కొత్త షెడ్యూల్ అఫీషియల్ అప్డేట్
Oo Antava Mava | ఉ అంటావా మావా మేనియా రిపీట్.. డీజే మార్టిన్‌తో అల్లు అర్జున్ డ్యాన్స్
Ahimsa | అభిరామ్-తేజ టీం క్రేజీ అప్డేట్.. అహింస రిలీజ్ టైం ఫిక్స్