ఆ సీన్స్ ట్రిమ్ చేయండి ప్లీజ్?
చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏముంటుంది?.. పాపం.. ఈ విషయం బాలీవుడ్ నటి కియారా అద్వానీకి అర్థం కావడంలేదు. జరగాల్సిన నష్టం జరిగిపోయాక.. సరిదిద్దుకునేందుకు ప్రయత్నించడం నిష్ప్రయోజనం.
చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏముంటుంది?.. పాపం.. ఈ విషయం బాలీవుడ్ నటి కియారా అద్వానీకి అర్థం కావడంలేదు. జరగాల్సిన నష్టం జరిగిపోయాక.. సరిదిద్దుకునేందుకు ప్రయత్నించడం నిష్ప్రయోజనం. ఇంతకీ చేతులు కాలేంత పని కియారా ఏం చేసింది? అనే వివరాల్లోకెళ్తే.. ‘కేజీఎఫ్’ఫేం యష్ నటిస్తున్న పానిండియా యాక్షన్ థ్రిల్లర్ ‘టాక్సిక్’లో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. తన కెరీర్లో ఇప్పటివరకూ గ్లామరస్, రొమాంటిక్, కమర్షియల్ రోల్స్ ఎన్నో చేసింది కియారా. అయితే.. ‘టాక్సిక్’లో మాత్రం మరింత బోల్డ్‌గా, ఇంటెన్స్ పాత్రను ఆమె పోషించింది.
ఇందులో శృతి మించిన బోల్డ్ సీన్స్‌లో కూడా కియారా నటించినట్టు వినికిడి. ఆ సీన్స్ పూర్తిగా ఆమె అనుమతితోనే దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కించినా, ఫైనల్ అవుట్‌పుట్ చూసుకున్నాక, కియారా షాక్‌కి గురైందట.
దాంతో ఆ బోల్డ్ సీన్స్‌ను ట్రిమ్ చేయాలంటూ దర్శకురాలిని కోరిందట. అయితే.. దర్శక,నిర్మాతలు అందుకు నిరాకరించినట్టు తెలిసింది. మరోవైపు.. ఇది కేవలం గాసిప్ మాత్రమేనని, సినిమాకు హైప్ తెచ్చేందుకే ఇలాంటి గాలివార్తలు సృష్టిస్తున్నారంటూ కూడా కథనాలు వెలువడుతున్నాయి. అసలు నిజమేంటో సినిమా విడుదలైతే కానీ తెలీదు. త్వరలోనే సినిమా విడుదల కానున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- bold scenes
- kiara advani
- Toxic
- Yash
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

