Khiladi on OTT | గతేడాది వచ్చిన ‘క్రాక్’ చిత్రంతో మాస్రాజ రవితేజ మంచి కంబ్యాక్ ఇచ్చాడు. అదే స్పీడులో వరుస పెట్టి సినిమాలను చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. ఈయన లేటెస్ట్గా రమేష్ వర్మ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘ఖిలాడి’. ఫిబ్రవరి 11న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే ఫ్లాప్ టాక్‌ను మూటగట్టుకుంది. ఈ చిత్రానికి 22.3 కోట్ల బిజినెస్ జరిగింది. 23కోట్లతో బ్రేక్ ఈవెన్‌లోకి దిగిన ఈ చిత్రం ఫుల్ రన్ ముగిసేసరికి 13.55 కోట్ల షేర్‌ను మాత్రమే సాధించి బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్ర డిజిటల్ రిలీజ్‌కు సంబంధించిన డేట్‌ను ప్రకటించారు.
ఖిలాడి చిత్రం మార్చి 11 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. థియేట్రికల్ రిలీజ్‌కు సరిగ్గా నెల రోజులకు
ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది. డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ ఎ స్టూడియోస్ బ్యానర్లపై కోనెరు సత్యనారాయణ నిర్మించాడు. తెలుగుతో పాటు హిందీలోనూ ఈ చిత్రం ఏకకాలంలో విడుదలైంది. యాక్షన్ కింగ్ అర్జున్ కీలకపాత్రలో నటించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.