కన్నడ స్టార్ యాక్టర్ యశ్ (Yash) ప్రధాన పాత్రలో నటిస్తోన్న పాన్ ఇండియా ప్రాజెక్టు కేజీఎఫ్ చాఫ్టర్ 2 (kgf chapter 2). యాక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్లో వస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్టర్. ఏప్రిల్ 14న కన్నడతోపాటు వివిధ భాషల్లో గ్రాండ్గా విడుదల కానుంది. అభిమానులు సినిమా ఎప్పుడు థియేటర్లకు వస్తుందా..? అని ఎదురుచూస్తుంటే ఊహించని వార్త ఒకటి ప్రస్తుతం ఇండస్ట్రీ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది.
కేజీఎఫ్ 2 ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజా అప్ డేట్ ఏంటంటే ఈ మూవీ ఇంట్రడక్షన్ సాంగ్ ను రీ షూట్ చేయడం. గతంలో చిత్రీకరించిన పాటతో ప్రశాంత్ నీల్ సంతోషంగా లేడట. మరింత బెటర్ గా పాటను తీయడానికి ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నా..దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ న్యూస్ ఇపుడు తెగ వైరల్ అవుతోంది. అన్నీ కుదిరితే త్వరలోనే రామోజీ ఫిలిం సిటీలో ఈ పాటను రీ షూట్ చేయనున్నారట. మరి త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.
హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న కేజీఎఫ్ 2లో బాలీవుడ్ నటు రవీనా టండన్, సంజయ్ దత్తోపాటు కన్నడ నటి శ్రీ నిధి శెట్టి, టాలీవుడ్ యాక్టర్లు రావు రమేశ్, ప్రకాశ్ రాజ్ కీ రోల్స్ చేస్తున్నారు.