Keerthi Suresh | రివాల్వర్ రీటాగా కీర్తిసురేష్.. ఆసక్తి రేకెత్తిస్తున్న ఫస్ట్‌లుక్ పోస్టర్..!
ఈ తరం కథానాయికలలో తన రూటే సెపరేటు అంటున్న నటి కీర్తి సురేష్. నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచమైన ఈ మలయాళ కుట్టి.. మొదటి సినిమాతోనే అందరి దృష్టి తనవైపు తిప్పుకుంది.
Keerthi Suresh | ఈ తరం కథానాయికలలో తన రూటే సెపరేటు అంటున్న నటి కీర్తి సురేష్. ‘నేను శైలజ’ సినిమాతో తెలుగు తెరకు పరిచమైన ఈ మలయాళ కుట్టి.. మొదటి సినిమాతోనే అందరి దృష్టి తనవైపు తిప్పుకుంది. ఇక ‘మహానటి’తో నేషనల్ అవార్డు గెలుచుకుని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. సావిత్రి బయోపిక్‌లో ఇంత కన్నా బాగా ఎవరు నటించలేరెమో అనేంతలా తన నటనతో కట్టిపడేసింది. ఈ సినిమా తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కీర్తి కేరాఫ్ అడ్రస్ అయిపోయింది. ఓ వైపు పార్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే మరోవైపు గ్లామర్ పాత్రలతోనూ అదరగొడుతుంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో అరడజను సినిమాలున్నాయి. అందులో చంద్రు దర్శకత్వంలో తెరకెక్కుతున్న కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ ఒకటి.
తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ సినిమాకు రివాల్వర్ రీటా పేరును ఫిక్స్ చేస్తూ.. రెండు చేతుల్లో రెండు రివాల్వర్స్ను పట్టుకుని ఉన్న కీర్తి పోస్టర్‌ను విడుదల చేశారు. పెయింటింగ్‌తో డిజైన్ చేసిన ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది. మహిళ ప్రధాన చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ది రూట్, ప్యాషన్ స్టూడీయోస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం కీర్తి తెలుగులో రెండు సినిమాలు చేస్తుంది. అందులో నానితో కలసి ‘దసరా’ మూవీ చేస్తుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ మూవీలో కీర్తి డీ గ్లామర్ పాత్ర పోషిస్తుంది. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో పాటుగా చిరుతో కలిసి ‘భోళా శంకర్’ చేస్తుంది. ఈ సినిమాలో కీర్తి, చిరంజీవికి చెల్లెలిగా నటిస్తుంది. సినిమా సినిమాకు తన పాత్రలతో వేరియేషన్ చూపిస్తూ.. అందరి హీరోయిన్లకు భిన్నంగా సెపరేట్ రూట్లో దూసుకుపోతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | సూర్య ‘సీన్’ ఓటీటీ రిలీజ్ టైం ఫిక్స్ .. నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుందంటే!
Kamareddy | కామారెడ్డి జిల్లా జిల్లాలో విషాదం.. కుంటలో పడి తండ్రి, కూతురు మృతి
Vijay Sethupathi | విజయ్ సేతుపతికి అరుదైన గౌరవం.. తొలి భారతీయ నటుడిగా ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల వేదికపై చరిత్ర!
KTR | ఒకే ఫ్రేమ్‌లో కేటీఆర్, సీఎం విజయ్, వైఎస్ జగన్.. ఫొటోలు వైరల్!
Cab Driver: భార్యను, ఆమె బంధువుల్లో ఆరుగుర్ని కడతేర్చిన క్యాబ్ డ్రైవర్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

