Keerthy Suresh | ముహూర్తం ఫిక్స్.. పెళ్లిపీటలెక్కేది ఆ రోజే?
అగ్ర కథానాయిక కీర్తి సురేష్ తన చిరకాల మిత్రుడు ఆంటోనితో పెళ్లిపీటలెక్కేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా కీర్తి సురేష్ తన పెళ్లి గురించి మాట్లాడింది.
Keerthy Suresh | అగ్ర కథానాయిక కీర్తి సురేష్ తన చిరకాల మిత్రుడు ఆంటోనితో పెళ్లిపీటలెక్కేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా కీర్తి సురేష్ తన పెళ్లి గురించి మాట్లాడింది. గోవాలో పెళ్లి జరుగుతుందని, త్వరలో అన్ని వివరాలను వెల్లడిస్తానని చెప్పింది. తాజాగా కీర్తి సురేష్ పెళ్లి తాలూకు వెడ్డింగ్ కార్డ్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఆహ్వాన పత్రికలో ఈ నెల 12న గోవాలో పెళ్లి జరగనున్నట్లు రాసి ఉంది.
అయితే పెళ్లి తేదీకి సంబంధించిన వివరాలను కీర్తి సురేష్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం మరికొద్ది రోజుల్లో కీర్తి సురేష్ కుటుంబ సభ్యులు పెళ్లి తేదీని ప్రకటిస్తారని తెలిసింది. ఇక కీర్తి సురేష్‌ను పెళ్లాడబోతున్న ఆంటోని ఆమె కాలేజీ స్నేహితుడు. దాదాపు 15 ఏండ్లుగా వీరిమధ్య మంచి స్నేహసంబంధాలున్నాయి. ఇద్దరి కుటుంబాలు కూడా సన్నిహితంగా ఉంటాయని తెలిసింది. ఆంటోని కేరళలో వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ రివాల్వర్ రీటా, బేబీ జాన్ చిత్రాల్లో నటిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

