ఈ ఏడాది మహేశ్ బాబుతో కలిసి సర్కారు వారి పాట సినిమాలో మెరిసింది కీర్తిసురేశ్ (Keerthy Suresh). ఈ నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ వర్క్ షెడ్యూల్ పక్కన పెట్టి సరదాగా స్నేహితులతో పార్టీ చేసుకుంది. కీర్తిసురేశ్ రీసెంట్గా ఇండస్ట్రీ స్నేహితులైన కల్యాణి ప్రియదర్శిని, పార్వతి తిరువొత్తు, అన్నా బెన్, రీమా కలింగల్, అదితి బాలన్, ప్రయాగ మార్టిన్‌తో కలిసి పార్టీ మూడ్‌ను ఫుల్ ఎంజాయ్ చేసింది.
లిల్లీ లక్ష్మి పార్టీకి హోస్ట్‌గా వ్యవహరించింది. సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ కూడా కీర్తిసురేశ్ గ్యాంగ్‌తో కలిసిపోయింది. ఇండస్ట్రీ భామలంతా కలిసి పార్టీ మూడ్‌లో చిల్ అవుట్ అవుతున్నపుడు దిగిన స్టిల్స్ ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది కీర్తిసురేశ్.
తెలుగులో రెండు భారీ చిత్రాల్లో నటిస్తోంది కీర్తిసురేశ్. మెగాస్టార్ చిరంజీవి టైటిలో రోల్ చేస్తున్న భోళా శంకర్‌లో చిరుకు సోదరిగా నటిస్తోంది. న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న దసరా (Dasara)లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది . ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన కీర్తిసురేశ్ ఫస్ట్ లుక్ ఆన్లైన్లో హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రంలో కీర్తిసురేశ్ పక్కా పల్లెటూరి అమ్మాయిగా డీగ్లామరైజ్డ్ రోల్లో కనిపించనుంది.
ట్రెండింగ్ అవుతున్న పార్టీ స్టిల్స్..