Keerthy Suresh | కరోనా టైంలో వస్తున్నావు.. గుడ్ లక్ కీర్తి సురేశ్..

Good Luck Sakhi | దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరగడంతో సంక్రాంతికి రావాల్సిన ట్రిపుల్ఆర్, రాధేశ్యామ్ వంటి పెద్ద సినిమాల విడుదల వాయిదా పడింది. నాగార్జున మాత్రం ధైర్యం చేసి బంగార్రాజు సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేశాడు. ఈ సినిమాకు ఓపెనింగ్స్ బాగానే వచ్చినా.. ఐదు రోజుల తర్వాత కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. ఇప్పటికీ ఈ సినిమా బ్రేక్ఈవెన్ కాలేదు. అందుకే ఇప్పుడు సినిమాలు విడుదల చేయడానికి చాలామంది నిర్మాతలు జంకుతున్నారు. ఇలాంటి సమయంలో కీర్తిసురేశ్ మాత్రం థియేటర్లలోకి వస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన గుడ్ లక్ సఖి సినిమా జనవరి 28న థియేటర్స్‌లో విడుదల అవుతుంది.
స్పోర్ట్స్ నేపథ్యంలో వస్తున్న గుడ్ లక్ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రల్లో నటించారు. అవార్డు విన్నింగ్ డైరెక్టర్ నగేశ్ కుకునూరు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. బ్యాడ్ లక్ తప్ప గుడ్ లక్ తెలియని ఒక అమ్మాయి కథ ఇది. ఇందులో పక్కా పల్లెటూరి అమ్మాయిగా కీర్తి సురేశ్ నటించింది. చాలారోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. కరోనా, ఇతరత్రా కారణాల వల్ల సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఒకానొక సమయంలో ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలోనే విడుదలవుతుందనే ప్రచారం జరిగింది. కానీ ఆ వార్తలన్నిటినీ కొట్టిపారేస్తూ థియేటర్లలోనే సినిమా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. కరోనా ఉన్నా కూడా ధైర్యంగా సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇటీవల ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేసింది. దీనికి యూట్యూబ్‌లో విశేష స్పందన లభించింది. ట్రైలర్ చూశాక సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే జనవరి 26న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా నిర్వహించారు.ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ముఖ్య అతిథిగా వచ్చాడు.
నిజానికి ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి రావాల్సి ఉంది. కానీ ఆయనకు చివరి నిమిషంలో కరోనా నిర్ధారణ కావడంతో.. చిరు ప్లేస్‌లో రామ్‌చరణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చాడు. ఈ కార్యక్రమంలో కీర్తి సురేశ్‌తో కలిసి నాటు నాటు పాటకు స్టెప్పు కూడా వేశాడు. ఏదేమైనా కరోనా టైంలో వస్తున్న ఈ సినిమాకు ఫ్యాన్స్ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. సినిమాలో బ్యాడ్ లక్ ఉన్నా బయట మాత్రం అంతా మంచే జరగాలని కోరుకుంటున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
Keerthy Suresh relaxing time | కీర్తిసురేశ్ ఎక్కడ రిలాక్స్ అవుతుందో చూడండి
Keerthy Suresh | వెరైటీ చీరకట్టులో కీర్తి సురేష్ అదిరిపోయే ఫొటోషూట్..
Keerthy Suresh: చెల్లెలు పాత్ర కోసం రెండు కోట్ల రెమ్యునరేషనా..!
Keerthy Suresh | సరికొత్త లుక్‌లో కీర్తి సురేష్.. కుర్రకారు ఫిదా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

