Keerthy Suresh |మూవీ లవర్స్‌కు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని నటి కీర్తిసురేశ్ (Keerthy Suresh). మహానటి సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న ఈ భామ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. ఈ ఏడాది దసరా సినిమాలో వెన్నెల పాత్రతో మరోసారి తెలుగు ప్రేక్షకులకు ఫిదా చేసింది. మామన్నన్తో మంచి హిట్టందుకుంది. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే కీర్తిసురేశ్ ఎక్కువగా సంప్రదాయ వస్త్రధారణలో కనిపించేందుకు ఇష్టపడుతుందని తెలిసిందే.
తాజాగా ఈ బ్యూటీ చీరకట్టు (Keerthy Suresh)లో నెట్టింట అందాలు ఆరబోస్తోంది. దసరాలో ఛమ్ కీలా అంగీలేసి (Chamkeela Angeelesi) పాటను గుర్తు చేస్తూ ఛమ్ కీలా చీరకట్టులో ధగధగ మెరుస్తూ నెటిజన్లను కట్టిపడేస్తుంది. పసుపురంగు చీరలో పడుచుదనం ఉట్టిపడేలా కనిపిస్తున్న కీర్తిసురేశ్ ఫొటోలు కుర్రకారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కీర్తిసురేశ్ తమిళంలో నాలుగు సినిమాలు చేస్తుండగా.. అన్నీ షూటింగ్ దశలో ఉన్నాయి.
యెల్లో శారీలో ఇలా..
Keerthy Suresh1
Keerthysuresh 2
#KeerthySuresh Shines like Sunshine in Yellow Saree 😍💛#DiwaliSpecialClick 🎇
📸 – #kiransaphotography pic.twitter.com/FX7JR3fSkY— Behindwoods (@behindwoods) November 13, 2023