Kavya & Anirudh | పెళ్లి పీటలెక్కబోతున్న కావ్యా మారన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్!
Kavya Maran and Anirudh Ravichander | సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) సీఈఓ కావ్యా మారన్, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ వివాహం చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు ఎట్టకేలకు చెక్ పడింది.
Kavya Maran and Anirudh Ravichander | సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) సీఈఓ కావ్యా మారన్, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ వివాహం చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు ఎట్టకేలకు చెక్ పడింది. తాజాగా వీరిద్దరూ ఒకటి కాబోతున్నట్లు కావ్య తండ్రి కళానిధి మారన్ తెలిపాడు. పెళ్లి వేడుక యూరప్‌లో జరుగబోతుండగా.. నవంబర్ 21న చెన్నైలో వీరి వివాహ రిసెప్షన్ అత్యంత వైభవంగా జరగనున్నట్లు సమాచారం. ఈ వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రికల అందజేత కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైంది.
ఇందులో భాగంగా సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్, ఆయన సతీమణి కావేరి మారన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఈ ఆహ్వానానికి సంబంధించిన వివరాలను అధికారికంగా ధృవీకరించడంతో ఈ వార్త రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అలాగే ఈ వేడుకకు మరికొంతమంది ప్రముఖ రాజకీయ, సినీ ప్రముఖులను కూడా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. మరోవైపు చెన్నైలో నవంబర్ 21న రిసెప్షన్ జరగనుండగా, అసలు వివాహం నవంబర్ 11న గ్రీస్‌లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా జరగనుందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇరు కుటుంబాల నుంచి ఇంకా పూర్తి స్థాయి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. వ్యాపార దిగ్గజ కుటుంబానికి చెందిన కావ్యా మారన్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఒక్కటవుతుండటంతో ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya & Anirudh | పెళ్లి పీటలెక్కబోతున్న కావ్యా మారన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
Engineering Student | దసరా సెలవులని వచ్చాడు.. ఇంట్లో కుప్పకూలిపోయిన విద్యార్థి
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

