Karuppu | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ‘కరుప్పు’ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్ల క్లబ్లో చేరి భారీ వసూళ్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా సాధిస్తున్న అద్భుతమైన విజయంతో చిత్రబృందం ఎంతో సంతోషంలో ఉంది. ఈ నేపథ్యంలో, సినిమాకు అద్భుతమైన విజువల్స్ అందించిన క్రేజీ సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణు (GK Vishnu)కు హీరో సూర్య ఒక ఖరీదైన లగ్జరీ కారును కానుకగా ఇచ్చి సర్ప్రైజ్ చేశారు.
ఈ విషయాన్ని సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణు స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ సూర్యకు కృతజ్ఞతలు తెలిపారు. సూర్య ఇచ్చిన కారు ఫోటోను షేర్ చేస్తూ.. “ఇదంతా దేవుడి దయ! థాంక్యూ సూర్య సార్. మీకు చాలా పెద్ద మనసు ఉంది” అంటూ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. గతంలో ‘మెర్సల్’, ‘బిగిల్’, ‘జవాన్’ వంటి భారీ చిత్రాలకు కెమెరామెన్‌గా పనిచేసిన జీకే విష్ణు, ఇప్పుడు ‘కరుప్పు’ చిత్రానికి అందించిన విజువల్స్ పట్ల ప్రేక్షకులు మరియు సినీ వర్గాల నుండి ప్రశంసల వర్షం కురుస్తోంది. సినిమా ఘన విజయం సాధించినప్పుడు టాలెంటెడ్ టెక్నీషియన్లను ఈ విధంగా గౌరవించడం సూర్యకు ఉన్న గొప్ప మనసును చాటిచెబుతోందని అభిమానులు కొనియాడుతున్నారు.