Viruman Movie | మలేషియాలో ‘విరుమన్’ ప్రమోషన్లు.. స్టైలిష్‌లుక్‌లో అదరగొడుతున్న కార్తి
Viruman Movie Promotions | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి. తెలుగులో ఈయన సినిమాలకు ఇక్కడి టైర్2 హీరోల సినిమాలకున్నంత క్రేజ్ ఉంది. అంతేకాకుండా కార్తి ఇక్కడ ఇంటర్వూలు గాని, స్పిచ్లలో గాని తెలుగులో మాట్లాడటంతో టాలీవుడ్ ప్రేక్షకులలో మరింత అభిమానం సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో ఐదు సినిమాలన్నాయి. అందులో ‘విరుమన్’ ఒకటి. ముత్తయ్య దర్శకత్వం వహించాడు. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 12న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్లను షురూ చేశారు.
తాజాగా కార్తి తన ఇన్‌స్టాగ్రామ్‌లో మలేషియాలో ప్రమోషన్ జరుపుతున్నట్లు తెలిపాడు. అంతేకాకుండా ఓ స్టైలిష్ ఫోటోను కూడా విడుదల చేశాడు. ఈ చిత్రంలో కార్తికి జోడీగా దిగ్గజ దర్శకుడు శంకర్ కుమార్తె అధితి శంకర్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసాయి. ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై సూర్య నిర్మించాడు. నిజానికి ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 30న విడుదల చేయాలని ముందుగా అనుకున్నారు. కానీ ఆగస్టు 12న విడుదలవ్వాల్సిన కోబ్రా వాయిదా పడటంతో ఈ చిత్రాన్ని మూడు వారాలు ముందుకు జరిపారు.
Good to see @Karthi_Offl promoting #Viruman in Malaysia. Rural entertainers work well in Malaysia and it’s a good move to expand his market 🙌. Looks stylish 😎 pic.twitter.com/3ufGFwvVGd
— Rajasekar (@sekartweets) August 7, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కరెంట్ సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి
Rahul Gandhi | ఇండియా బ్లాక్ పార్టీలకు హైటీ ఏర్పాటు చేసిన రాహుల్.. సీఈసీకి వ్యతిరేకంగా చేపట్టాల్సిన పోరుపై చర్చ
Aishwarya | ‘మీరు ఎంతమందిని చంపుతున్నారు.. ఐశ్వర్య మృతికి కారణం డాక్టర్ల నిర్లక్ష్యమే’
రిటర్నింగ్ వాల్ మూసివేతపై డీజీఎం సివిల్ రాజేంద్ర కుమార్ విచారణ
SA vs AUS | జగజ్జేతకు ఆసీస్ ఝలక్.. సొంతగడ్డపై సఫారీలకు తొలి ఓటమి..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

