Karthi | కార్తి ‘విరుమన్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. విడుదల ఎప్పుడంటే?
Karthi Viruman Release Date | తమిళ స్టార్ కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుంచి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలయ్యాయి. తెలుగులో ఈయన సినిమాలకు టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోల సినిమాలకున్నంత క్రేజ్ ఉంది. అంతేకాకుండా కార్తి ఇక్కడ ఇంటర్వూలు గాని, స్పిచ్లలో గాని తెలుగులోనే మాట్లాడటంతో టాలీవుడ్ ప్రేక్షకులలో మరింత అభిమానం సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో ఐదు సినిమాలన్నాయి. అందులో ‘విరుమన్’ ఒకటి. ముత్తయ్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు శంకర్ కూతురు అధితి హీరోయిన్గా నటించింది.
యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వినాయక చతుర్థి సందర్భంగా ఆగస్టు 31న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్టైనమెంట్స్ పతాకంపై సూర్య, జ్యోతిక నిర్మించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరపుకుంటుంది. ప్రస్తుతం కార్తి, పీ.ఎస్ మిత్రన్ దర్శకత్వంలో ‘సర్దార్’ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో మంచి అంచనాలే నెలకొన్నాయి. వీటీతో పాటుగా మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నీయున్ సెల్వన్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర మొదటి భాగం సెప్టెంబర్ 30న విడుదల కానుంది.
ஆகஸ்ட் 31 விநாயகர் சதுர்த்திக்கு வர்றோம் #விருமன் #VirumanFromAug31@Karthi_Offl @Suriya_offl @2D_ENTPVTLTD @dir_muthaiya @thisisysr @AditiShankarofl @rajsekarpandian @prakashraaj #Rajkiran @sooriofficial @sakthivelan_b pic.twitter.com/qnr2X1NKKT
— Karthi (@Karthi_Offl) May 18, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

