Karthi | కార్తి ‘విరుమన్’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడేనట?
Karthi Viruman Movie | తమిళ స్టార్ కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుంచి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలయ్యాయి. తెలుగులో ఈయన సినిమాలకు టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోల సినిమాలకున్నంత క్రేజ్ ఉంది. అంతేకాకుండా కార్తి ఇక్కడ ఇంటర్వూలు గాని, స్పిచ్లలో గాని తెలుగులోనే మాట్లాడటంతో టాలీవుడ్ ప్రేక్షకులలో మరింత అభిమానం సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో ఐదు సినిమాలన్నాయి. అందులో ‘విరుమన్’ ఒకటి. ముత్తయ్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు శంకర్ కూతురు అధితి హీరోయిన్గా నటించింది. తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుంచి ఓ అప్డేట్ను ప్రకటించారు.
ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోను మే 25న మధ్యాహ్నం 12.00 గంటలకు విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం వినాయక చతుర్థి సందర్భంగా ఆగస్టు 31న విడుదల కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరపుకుంటున్న ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్టైనమెంట్స్ పతాకంపై సూర్య, జ్యోతికలు నిర్మించారు. కార్తి ప్రస్తుతం పీ.ఎస్ మిత్రన్ దర్శకత్వంలో ‘సర్దార్’ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో మంచి అంచనాలే నెలకొన్నాయి. వీటీతో పాటుగా మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నీయిన్ సెల్వన్’ చిత్రంలో నటించాడు. ఇటీవలే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్ర మొదటి భాగం సెప్టెంబర్ 30న విడుదల కానుంది.
#KanjaPoovuKannala from May 25th! #VirumanFirstSingle @Suriya_offl @dir_muthaiya @AditiShankarofl @rajsekarpandian @thisisysr @sidsriram @2D_ENTPVTLTD#Viruman pic.twitter.com/lj6JrNvWtz
— Karthi (@Karthi_Offl) May 23, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

