Japan | రిలీజ్ టైం ఫిక్స్ చేసిన కార్తీ టీం.. జపాన్ వచ్చేది అప్పుడే..!
Japan | కార్తీ (Karthi) లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం జపాన్ (Japan). రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అభిమానుల్లో జోష్ నింపే అప్డేట్ ఒకటి ప్లాన్ చేసిందన్న వార్త ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.
Japan | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ఫైనెస్ట్ యాక్టర్ల జాబితాలో టాప్‌లో ఉంటాడు కార్తీ (Karthi). కార్తీ లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం జపాన్ (Japan). రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఫస్ట్ లుక్ పోస్టర్లతో సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేసిన కార్తీ టీం.. అభిమానుల్లో జోష్ నింపే అప్డేట్ ఒకటి ప్లాన్ చేసిందన్న వార్త ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 15న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారని వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
విడుదలపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. జపాన్ షూటింగ్లో భాగంగా కార్తీ టీం ఇటీవలే హైదరాబాద్‌లో ల్యాండ్ అయినట్టు ఓ వార్త కూడా వచ్చిన విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్లో కార్తీ, ఇతర నటీనటులపై వచ్చే యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు టాక్. ఈ చిత్రానికి అన్బరివ్ యాక్షన్ సన్నివేశాలను కంపోజ్ చేస్తున్నాడు.
జపాన్‌లో అనూ ఎమ్మాన్యుయేల్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రంలో సునీల్, విజయ్ మిల్టన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.జపాన్ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ప్రభు నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవలే కార్తీ వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటించిన మల్టీస్టారర్ పొన్నియన్ సెల్వన్ -2 బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే.

Japan
#Karthi‘s #Japan planning to grab the prestigious Vinayagar Chathurthi weekend (Sept 15th) 💥 pic.twitter.com/6qgIsYL8cu
— VCD (@VCDtweets) May 16, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

