Japan | కార్తీ (Karthi) టైటిల్ రోల్లో నటిస్తున్న సినిమా జపాన్ (Japan). రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో అనూ ఎమ్మాన్యుయేల్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఇప్పటికే జపాన్ నుంచి లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. జపాన్ ఫైనల్ షెడ్యూల్ అప్డేట్ బయటకు వచ్చింది. తమిళనాడులోని EVP Film Cityలో జూన్ 2 నుంచి ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ షురూ కానుంది. సుమారు నెల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు షురూ కానున్నాయి.
ఇటీవలే విడుదల చేసిన జపాన్ ఇంట్రడక్షన్ వీడియోలో నయా లుక్‌తో కనిపిస్తూ సందడి చేస్తున్నాడు కార్తీ. మీరనుకుంటున్నట్టు కాదు.. వాడు దూల తీర్చే విలన్.. అని కార్తీ క్యారెక్టర్ గురించి చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నాడు. జీవీ ప్రకాశ్ కుమార్ బీజీఎం సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా ఉండబోతున్నట్టు ఇంట్రో వీడియోతో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్. ఈ చిత్రానికి అన్బరివ్ యాక్షన్ కొరియోగ్రఫర్.
జపాన్‌లో సునీల్, విజయ్ మిల్టన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ప్రభు నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని దీపావళి సందర్బంగా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ తాజా వీడియోతో ప్రకటించేశారు. కార్తీ స్టైలిష్‌గా ఇదివరకెన్నడూ కనిపించని లుక్‌లో పక్కా ఎంటర్టైన్ మెంట్ అందించబోతున్నట్టు క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్.
జపాన్ ఇంట్రడక్షన్ వీడియో..