Karthi 27 | ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు కార్తీ (Karthi). ఈ టాలెంటెడ్ యాక్టర్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం జపాన్ (Japan). రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అనూ ఎమ్మాన్యుయేల్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మరోవైపు కార్తీ 26 (Karthi 26) కొన్నాళ్ల క్రితం షురూ అవగా.. ఈ ఏడాది చివరి కల్లా చిత్రీకరణ పూర్తి కానున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పుడు కార్తీ 27 (Karthi 27) అప్డేట్ అందించి అభిమానులు, మూవీ లవర్స్‌లో ఫుల్ జోష్ నింపుతున్నాడు. ఈ చిత్రానికి 96 ఫేం ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించనున్నాడు.
ఈ మూవీకి గోవింద్ వసంత సంగీతం అందించనుండగా.. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్. ఈ చిత్రంలో పాపులర్ తమిళ నటుడు అరవింద్ స్వామి కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అరవింద్ స్వామి ఎలాంటి పాత్రలో కనిపిస్తాడనే దానిపై ప్రస్తుతం సస్పెన్స్ నెలకొంది. సూర్య హోం బ్యానర్ 2డీ ఎంటర్టైన్మెంట్ పై ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. కార్తీ 26వ ప్రాజెక్ట్ షూటింగ్ పూర్తయిన తర్వాత కార్తీ 27 మొదలు కానుందని సమాచారం. ఇప్పటికే విడుదలైన జపాన్ ఇంట్రడక్షన్ వీడియోతోపాటు, ఫస్ట్ లుక్ పోస్టర్లు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన జపాన్ లుక్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రంలో సునీల్, విజయ్ మిల్టన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ప్రభు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను దీపావళి సందర్బంగా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించేశారు మేకర్స్.
Official : #Karthi27 – Another Exciting project from #Karthi ..💥
Starring : #Karthi & #ArvindSwami
Direction : #Premkumar (96 Fame)
Music : #GovindVasantha
Cinematography : #PCSreeram
Production : #Suriya‘s 2D Entertainment pic.twitter.com/aiHC7OV9wQ— Laxmi Kanth (@iammoviebuff007) July 26, 2023
జపాన్ ఇంట్రడక్షన్ వీడియో..