Kareena Kapoor Khan |ఒకానొక దశలో కరీనాకపూర్ అంటే యువతరం కలలరాణి. ప్రస్తుతమైతే పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ, మంచి పాత్ర దొరికితే అప్పుడప్పుడు మాత్రమే సినిమాల్లో తళుక్కున మెరుస్తున్నది కరీనా. కెరీర్లో సూపర్‌స్టార్‌డమ్‌ని ఎంజాయ్చేసి, కోట్లాదిమంది యువతకు ఆరాధ్యదేవతగా వెలిగిన కరీనా కూడా ఓ హీరోయిన్ ఫ్యాన్. కరీనా మనసు దోచిన ఆ హీరోయిన్ ఎవరో అనుకుంటున్నారా? తనెవరోకాదు.. అలియాభట్. అవును అలియా అభిమాని కరీనా.
ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తన మనసులోమాట చెప్పేసింది కరీనా. ‘నాకు నేటి కథానాయికల్లో అలియాభట్ అంటే చాలా ఇష్టం. తను మా ఇంటి అబ్బాయిని చేసుకుందని కాదు. నటిగా తను ఓ రేంజ్. అంతేకాదు, తను ఎంచుకునే పాత్రలు కూడా అద్భుతం. సినిమా సినిమాకీ నటిగా తన స్థాయిని పెంచుకుంటుంది. అలియా, రణ్‌బీర్ పెళ్లి చేసుకోకముందే నేను అలియా ఫ్యాన్‌ని. ఆ విషయం తనకు కూడా చెప్పాను. తనేమో నా ఫ్యాన్‌ని అని అందరికీ చెప్పుకుంటుంది. ఏదేమైనా ఆమెకు మంచి కెరీర్ ఉంది. రణ్‌బీర్ తనని ప్రోత్సహిస్తే వెండితెరపై అద్భుతాలు సృష్టించగల నటి అలియా’ అని చెప్పారు కరీనా.