Odiyan The Age Of Illusion | ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. ఆయనకు చెందిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ‘ధర్మ ప్రొడక్షన్స్’ నిర్మిస్తున్న మొదటి మలయాళ చిత్రాన్ని మంగళవారం అధికారికంగా ప్రకటించారు. రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘ఒడియన్: ది ఏజ్ ఆఫ్ ఇల్యూజన్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, సీనియర్ నటి మంజు వారియర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కేరళ జానపద కథల్లోని ఒక రూపాన్ని మార్చే శక్తులున్న వ్యక్తి, ఒక శక్తివంతమైన మాతృస్వామ్య కుటుంబంపై పగ తీర్చుకునే నేపథ్యంలో, నిజానికి భ్రమకు మధ్య జరిగే పోరాటంగా ఈ చిత్రం రూపొందనుంది. ధర్మ ప్రొడక్షన్స్ మరియు పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను మలయాళంతో పాటు హిందీ, తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో పాన్-ఇండియా లెవెల్లో భారీగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
అయితే ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పోస్టర్‌ను పంచుకున్న కరణ్ జోహార్, మలయాళ సినిమా రంగంలోకి అడుగుపెట్టడం గర్వంగా ఉందన్నారు. పృథ్వీరాజ్‌తో కలిసి మరిన్ని ప్రాజెక్ట్స్ చేయబోతున్నామని, దర్శకుడు రాహుల్ సదాశివన్ జానపద కథలను వెన్నులో వణుకు పుట్టించేలా తెరకెక్కించడంలో దిట్ట అని కొనియాడారు. ‘భూతకాలం’, ‘భ్రమయుగం’, ‘డైస్ ఇరై’ వంటి మైండ్ బెండింగ్ హారర్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ సదాశివన్‌కు ఇది కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రమని చెప్పవచ్చు.
A battle between truth and illusion unfurls soon.
Presenting Odiyan – The Age Of Illusion.Written & Directed by Rahul Sadasivan
Starring Manju Warrier & Prithviraj Sukumaran
Produced by Karan Johar, Adar Poonawalla, Apoorva Mehta & Supriya Menon#ManjuWarrier @PrithviOfficial… pic.twitter.com/z7UkK74BzH— Prithviraj Sukumaran (@PrithviOfficial) June 16, 2026