Kara Movie | ‘కర’ రివ్యూ: బ్యాంక్ రాబరీ వెనుక బలమైన ఎమోషన్.. ధనుష్ నటన ఎలా ఉందంటే?
Kara Movie | వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకోవడంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ధనుష్.
Dhanush New Movie | వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకోవడంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ధనుష్. ‘పోర్ తొళిల్’ వంటి సూపర్ హిట్ థ్రిల్లర్‌ను అందించిన దర్శకుడు విఘ్నేష్ రాజా దర్శకత్వంలో ధనుష్ నటించిన తాజా చిత్రం ‘కర’. మమితా బైజు కథానాయికగా నటించిన ఈ సైకలాజికల్ యాక్షన్ డ్రామా ఏప్రిల్ 30న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం.
కథ
1990ల కాలంలో సాగే ఈ కథలో ‘కర స్వామి’ (ధనుష్) ఒక పల్లెటూరి దొంగ. తండ్రి కోదండం (కేఎస్ రవికుమార్)తో గొడవపడి ఇంటి నుండి బయటకు వచ్చిన కర.. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ బతుకుతుంటాడు. సొంతంగా హోటల్ పెట్టుకోవాలనే తన ఆశకు బ్యాంకులు లోన్ ఇవ్వకపోవడం, అదే సమయంలో ఊరిలో ఉన్న తన తండ్రి మరణించడం అతడిని తీవ్రంగా కలిచివేస్తాయి. తన తండ్రి మరణానికి, ఊరిలోని రైతుల కష్టాలకు ‘పంచవన్ బ్యాంక్’ వ్యవహార శైలే కారణమని తెలుసుకున్న కర.. అదే బ్యాంకు శాఖల్లో వరుస రాబరీలకు పాల్పడతాడు. అసలు కర ఎందుకు బ్యాంకులను టార్గెట్ చేశాడు? డీఎస్పీ భరతన్ (సూరజ్ వెంజరమూడు) అతడిని ఎలా పట్టుకున్నాడు? బ్యాంకు మేనేజర్ ముత్తు సెల్వన్ (జయరామ్) పాత్ర ఏమిటి? అనేదే మిగతా సినిమా.
విశ్లేషణ:
దర్శకుడు విఘ్నేష్ రాజా ఒక సాధారణ దొంగ కథకు తండ్రీకొడుకుల ఎమోషన్‌ను, రైతుల సమస్యలను జోడించి అద్భుతంగా తెరకెక్కించారు. ముఖ్యంగా 90ల నాటి పల్లెటూరి వాతావరణాన్ని, అప్పట్లో ఉన్న పెట్రోల్ కొరత వంటి అంశాలను నేటి పరిస్థితులకు తగ్గట్లుగా రిలేట్ చేస్తూ చూపడం ఆకట్టుకుంటుంది. ఫస్టాఫ్ అంతా పాత్రల పరిచయం, ఎమోషన్స్‌తో కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ.. ఇంటర్వెల్ నుండి కథ వేగం పుంజుకుంటుంది. సెకండాఫ్‌లో వచ్చే బ్యాంక్ రాబరీ సీన్లు, యాక్షన్ ఎపిసోడ్లు సినిమాను రేసీగా మారుస్తాయి. మధ్యతరగతి ప్రజలను బ్యాంకులు చట్టాల పేరుతో ఎలా ఇబ్బంది పెడతాయో చూపించిన విధానం రైతులకు, సామాన్యులకు బాగా కనెక్ట్ అవుతుంది.
నటీనటుల పనితీరు:
ధనుష్ మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించారు. ఒక సాధారణ దొంగగా, తండ్రిని కోల్పోయిన కొడుకుగా, వ్యవస్థపై ఎదురుతిరిగిన వీరుడిగా కర స్వామి పాత్రలో లీనమైపోయారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో ఆయన నటన కన్నీళ్లు పెట్టిస్తుంది. మమితా బైజు పాత్ర నిడివి తక్కువైనా ఉన్నంతలో చక్కగా నటించింది. విలనీ షేడ్స్ ఉన్న పాత్రలో జయరామ్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా సూరజ్ వెంజరమూడు తమ అనుభవాన్ని ప్రదర్శించారు. కేఎస్ రవికుమార్ తండ్రి పాత్రలో ఒదిగిపోయారు.
సాంకేతిక నిపుణులు:
జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. ప్రతి సీన్‌ను తన మ్యూజిక్‌తో ఎలివేట్ చేశారు. తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ 90ల కాలపు ఫీల్‌ను కళ్ళకు కట్టినట్లు చూపించింది. డబ్బింగ్ సినిమా అయినప్పటికీ, ఎక్కడా ఆ భావన కలగకుండా సాహిత్యం, మాటల విషయంలో తీసుకున్న జాగ్రత్తలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్:
ధనుష్ అద్భుతమైన నటన
బలమైన తండ్రీ-కొడుకుల ఎమోషన్
నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ
సామాజిక కోణంలో సాగే బ్యాంక్ రాబరీ కథ
మైనస్ పాయింట్స్:
నెమ్మదిగా సాగే ఫస్టాఫ్
హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత తక్కువ ఉండటం
ముగింపు:
మొత్తానికి ‘కర’ ఒక స్లో బర్న్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్. కేవలం దొంగతనాలు మాత్రమే కాకుండా, వాటి వెనుక ఉన్న బలమైన సామాజిక కారణాన్ని దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు. క్లైమాక్స్‌లో వచ్చే క్లారిటీ ప్రేక్షకుడికి పూర్తి సంతృప్తిని ఇస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

