Kara Mamitha Baiju | ధనుష్ ‘కర’లో హీరోయిన్ ఎంపికపై ట్విస్ట్… ఫస్ట్ ఛాయిస్ మమితా కాదట, మరి ఎవరు?
Kara Mamitha Baiju | కోలీవుడ్ స్టార్ ధనుష్, మలయాళ బ్యూటీ మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘కర’ విడుదలకు సిద్ధమవుతోంది. విఘ్నేష్ రాజా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ధనుష్, మమితా భార్యాభర్తలుగా కనిపించనున్నారు. ఈ నెల 30న తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Kara Mamitha Baiju | కోలీవుడ్ స్టార్ ధనుష్, మలయాళ బ్యూటీ మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘కర’ విడుదలకు సిద్ధమవుతోంది. విఘ్నేష్ రాజా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ధనుష్, మమితా భార్యాభర్తలుగా కనిపించనున్నారు. ఈ నెల 30న తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.అయితే ఈ సినిమాలో హీరోయిన్గా మొదట ఎంపిక మమితా కాదని దర్శకుడు విఘ్నేష్ రాజా తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం… ఈ పాత్ర కోసం మొదట చైత్ర జె ఆచార్‌ను ఎంపిక చేసి లుక్ టెస్ట్ కూడా చేశారు. అయితే ఆమె ఇప్పటికే నటించిన ‘మై లార్డ్’ సినిమాలో కూడా ఇలాంటి గెటప్ ఉండటంతో, రెండు చిత్రాల్లో ఒకే తరహా పాత్రగా కనిపిస్తుందని భావించి మార్పు చేసినట్లు తెలిపారు.
ఆ తర్వాత మమితా బైజును సంప్రదించామని, ఆమె ఇప్పటివరకు చేసిన పాత్రలకు భిన్నంగా ‘కర’లోని పాత్ర ఉండటంతో మొదట అంగీకరిస్తుందో లేదో అనుమానం కలిగిందని చెప్పారు. కానీ కథ విన్న వెంటనే ఆమె ఒప్పుకోవడం ఆశ్చర్యం కలిగించిందని దర్శకుడు వెల్లడించారు. ఇదిలా ఉండగా, తమిళ సినిమాల్లో అవకాశాల కోసం మలయాళ నటీమణులను ఎంపిక చేస్తున్నారన్న విమర్శలపై మమితా బైజు స్పందించారు. ఒక నటిగా కొత్త పాత్రలు చేయడం తన బాధ్యత అని, దర్శకుడు తన పాత్రకు సరిపోతామనుకుంటే అవకాశం ఇస్తారని పేర్కొన్నారు. ఆ అవకాశాన్ని తన ప్రతిభతో నిలబెట్టుకోవడమే తన లక్ష్యమని తెలిపారు.
ఈ చిత్రంలో ధనుష్, మమితా బైజుతో పాటు జయరాం, సూరజ్ వెంజరమూడు, కేఎస్ రవికుమార్, కరుణాస్ కీలక పాత్రల్లో నటించారు. సంగీతాన్ని జీవీ ప్రకాష్ కుమార్ అందించగా, వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఇషారి కె గణేష్ నిర్మించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో పల్లెటూరి వ్యక్తి ఎలా దొంగగా మారాడు అనే అంశాన్ని ఆసక్తికరంగా చూపించబోతున్నారు. కథ, నటీనటుల కాంబినేషన్‌తో ‘కర’పై మంచి అంచనాలు నెలకొన్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

