Kantara | కాంతార ఓటీటీ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన చిత్ర బృందం..!
Kantara | ఇటీవల విడుదలైన కన్నడ చిత్రం ‘కాంతార’ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతూ అన్ని భాషల్లో భారీ వసూళ్లను రాబడుతోంది. కేజీఎఫ్ తర్వాత కన్నడ ఇండస్ట్రీ నుంచి విడుదలై టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఈ సినిమాకి దేశవ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తోంది. సామాన్య ప్రజలనే కాకుండా సెలబ్రిటీలను సైతం మంత్ర ముగ్దుల్ని చేస్తోంది. కాగా, ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌పై ఇటీవల సోషల్ మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి.

నవంబర్ 4 నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. దీనిపై తాజాగా చిత్ర బృందం స్పందించింది. ఆ వార్తలో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. ‘‘ఇది తప్పుడు వార్త. నవంబర్ 4న ఓటీటీలో వస్తుందన్న వార్తలో నిజం లేదు. ఈ చిత్రం ఓటీటీలో ఎప్పుడు వస్తుందో మేము అనౌన్స్ చేస్తాం’’ అని స్పష్టం చేసింది.
యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో కేజీఎఫ్ ఫేం హోంబలే ఫిలింస్ బ్యానర్లో విజయ్ కిరగందూర్ తెరకెక్కించారు. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో లీడ్ రోల్ పోషించిన ఈ మూవీ సెప్టెంబర్ 30న మాతృక భాష కన్నడలో విడుదలైన విషయం తెలిసిందే.
Wrong News! We will let you know when it is coming but certainly not November 4th. https://t.co/uU30w9jVC1
— Karthik Gowda (@Karthik1423) October 27, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- kantara
- ott
- OTT release
- Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran | భారత నౌకలకు హర్మూజ్‌లో ప్రత్యేక మినహాయింపు ఇచ్చిన ఇరాన్..!
Panchayat Secretaries | డోన్ట్ కేర్.. హాజరు వేసుకొని ఇంటికెళ్తున్న పంచాయతీ కార్యదర్శులు..!
Double Murder | మీర్పేట్లో జంట హత్యల కలకలం.. పోలీసుల నిర్లక్ష్యమే కారణమా..?
Girl died | కార్డియాక్ అరెస్ట్‌తో స్కూల్లో కుప్పకూలిన తొమ్మిదేళ్ల బాలిక..!
Tirumala | దేశానికే ఆదర్శంగా నిలిచేలా తిరుమలలో వాటర్,ఫుడ్ అనాలసిస్ ల్యాబ్ అభివృద్ధి : టీటీడీ
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం