kantara-2 Movie | కాంతార-2 వచ్చేస్తుంది.. కానీ సీక్వెల్ కాదంట..!
గతేడాది బిగ్గెస్ట్ హిట్లలో 'కాంతార' ఒకటి. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించింది కాంతార మూవీ. గతేడాది సెప్టెంబర్‌లో భారీ అంచనాల నడుమ కన్నడలో రిలీజైన ఈ సినిమా మొదటి రోజు నుండి పాజిటీవ్ టాక్ తెచ్చుకుని భారీ వసూళ్లు సాధించింది.
kantara-2 Movie | గతేడాది బిగ్గెస్ట్ హిట్లలో ‘కాంతార’ ఒకటి. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించింది. గతేడాది సెప్టెంబర్‌లో భారీ అంచనాల నడుమ కన్నడలో రిలీజైన ఈ సినిమా మొదటి రోజు నుండి పాజిటీవ్ టాక్ తెచ్చుకుని భారీ వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమాకు వస్తున్న ఆధరణతో అన్ని భాషల ప్రేక్షకుల నుండి భారీ డిమాండ్ ఏర్పడింది. దాంతో మేకర్స్ పలు భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఇక రిలీజైన ప్రతి భాషలో భారీ వసూళ్ళను సాధిస్తూ డబుల్ బ్లాక్‌బస్టర్ నిలిచింది.
కాగా ఈ సినిమా కలెక్షన్ల పరంగానే కాదు అవార్డుల్లోనూ సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఇండియా తరపు నుండి ఆస్కార్‌కు నామినేట్ అయిన పది సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు పార్ట్-2 తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది. గతంలో రిషబ్‌శెట్టి పార్ట్-2 తీసే ఉద్ధేశమే లేదని పలుసార్లు చెప్పాడు. కానీ ప్రేక్షకుల నుండి భారీ డిమాండ్ ఏర్పడటంతో సెకండ్ పార్ట్‌ను ప్లాన్ చేస్తున్నాడట. అయితే సెకండ్ పార్ట్‌ను సీక్వెల్‌గా కాకుండా ప్రీక్వెల్‌గా తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాడట. రెండో భాగంలో రిషబ్ తండ్రి జీవితం, ఆయన చనిపోయి ఎటెళ్లారు అనే అంశాలను చూపించబోతున్నట్లు టాక్. ఇందులో భాగంగానే రిషబ్ తాజాగా కర్ణాటకలోని కోస్టల్ ప్రాంతానికి వెళ్లాడట. వీలైనంత త్వరగా ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లి, వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తు్న్నారట.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

