కన్నడ చిత్రం ‘కాంతారా’ చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. దక్షిణ కన్నడ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో భూతకోల దైవారాధన కథాంశంతో ఆధ్యాత్మిక థ్రిల్లర్‌గా భాషాభేదాలకు అతీతంగా విజయాన్ని సాధించింది. చిత్ర హీరో, దర్శకుడు రిషబ్‌శెట్టి తిరుగులేని గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ చిత్రానికి ప్రీక్వెల్‌గా ‘కాంతారా చాప్టర్ 1’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సోమవారం ఫస్ట్‌లుక్‌తో పాటు టీజర్‌ను విడుదల చేశారు. ‘ఈ వెలుగులో భూతభవిష్యత్తు కాలాలన్నీ కనిపిస్తాయి. ఇది కేవలం వెలుగు మాత్రమే కాదు..ఓ దైవ దర్శనం. అది నీకు కనిపిస్తుందా? అనే వాయిస్ ఓవర్‌తో టీజర్ థ్రిల్‌ను పంచింది. హీరో రిషబ్‌శెట్టి లుక్స్, ఆహార్యం విభిన్నంగా కనిపించాయి. హోంబలే ఫిల్మ్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటున్నది.