Kantara-2 Movie | ఊహించని రేంజ్లో కాంతార ప్రీక్వెల్.. బడ్జెట్ వంద కోట్లకు పైమాటే అట..!
Kanatara Prequel | తొలిపార్టు ఊహించని రేంజ్లో హిట్టు కావడంతో రిషబ్ శెట్టికి హోంబలే సంస్థ పూర్తి స్వేచ్ఛనిచ్చారట. దాంతో ప్రీక్వెల్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లే విధంగా రిషబ్ ప్లాన్ చేస్తున్నాడట.
Kanatara Prequel | కొన్ని సినిమాలను మాటల్లో వర్ణించడానికి పదాలు చాలవు. డిక్షనరి కొనుక్కొని కొత్త కొత్త పదాలను వెతుక్కోవాల్సి ఉంటుంది. అలా మాటల్లో చెప్పలేని సినిమాల్లో ‘కాంతార’ ఒకటి. తెలిసిన కథే కావచ్చు.. కానీ ఆ కథనే ఎంత కొత్తగా చెప్పాము అనేది దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. ఈ విషయంలో వందకు వంద మార్కులు కొట్టేశాడు దర్శకుడు రిషబ్ శెట్టి. దర్శకుడిగా రిషబ్‌శెట్టి ఒక మెట్టు ఎక్కితే.. నటుడిగా పది మెట్లు ఒకేసారి ఎక్కాడు. గతేడాది బిగ్గెస్ట్ హిట్లలో ‘కాంతార’ ఒకటి. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించింది. భాషతో సంబంధంలేకుండా ప్రతీ ఏరియాలో ఓ ఊపే ఊపేసింది.
ఇక ఈ సినిమాకు పార్ట్-2 కూడా తెరకెక్కబోతుందంటూ కొన్ని నెలల కింద రిషబ్ అనౌన్స్మెంట్ ఇచ్చేశాడు. అంతేకాకుండా ఇది సీక్వెల్లా కాకుండా ప్రీక్వెల్లాగా రూపొందిస్తాడట. అంటే రిషబ్ తండ్రి గురించి, ఆయన చనిపోవడం, ఆ పల్లె సంప్రదాయాల వెనుక మూలం ఎక్కడ మొదలయ్యింది, దేవుడు ప్రత్యేకంగా ఒక తెగవాళ్లనే ఎందుకు పూనుతాడు లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ప్రీక్వెల్‌లో చూపించబోతున్నాడు. దీని కోసం రిషబ్ గ్రౌండ్‌వర్క్ చాలానే చేశాడట. ఇక తొలిపార్టును రూ.16 కోట్లలోపే ముగించిన రిషబ్.. ప్రీక్వెల్ కోసం ఏకంగా రూ.120 కోట్ల బడ్జెట్‌ను ప్లాన్ చేస్తున్నాడట. ఒక్క ప్రీ ప్రొడక్షన్ కోసమే రూ.20 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది.
తొలిపార్టు ఊహించని రేంజ్లో హిట్టు కావడంతో రిషబ్ శెట్టికి హోంబలే సంస్థ పూర్తి స్వేచ్ఛనిచ్చారట. దాంతో ప్రీక్వెల్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లే విధంగా రిషబ్ ప్లాన్ చేస్తున్నాడట. అంతేకాకుండా కాంతార-1లో ఒకరిద్దరూ మినహాయించి పెద్దగా స్టార్ కాస్ట్ ఏమి లేదు. కానీ ప్రీక్వెల్‌లో మాత్రం స్టార్ కాస్ట్‌ను తీసుకోబోతున్నట్లు టాక్. నవంబర్‌లో షూటింగ్‌ను మొదలు ప్టెటి.. ఆరు నెలలు షూటింగ్, ఆపై రెండు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని వచ్చే ఏడాది ద్వితియార్థంలో సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

